»   » లాస్ట్ మినిట్ ట్విస్ట్ : ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ విజయవాడలో ఆగినట్లేనా... కారణం?

లాస్ట్ మినిట్ ట్విస్ట్ : ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ విజయవాడలో ఆగినట్లేనా... కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం 150' విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈ సినిమాకు ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరక్ట్ గా మార్కెట్ లో పాటలు విడుదల చేసారు. ఆ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో పంక్షన్ నిర్వహించకపోవడంతో టీమ్ పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించాలని ప్లాన్ చేసింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదికగా విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంను నిర్ణయించారు. జనవరి 4న డేట్ ఫిక్స్ చేసుకుని ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. కానీ కొన్ని ప్రభుత్వ పరమైన కారణాల వలన విజయవాడలో జరగాల్సిన ఈ వేడుక ఆగిపోయిందని తెలుస్తోంది.


Update on Khaidi No 150 Pre Release Event

దీంతో టీమ్ వెంటనే తేదీ, వేదిక రెండూ మార్చేశారు. జనవరి 7న గుంటూరులోని బిఆర్. స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకేసారి లక్ష మంది జనాభా కూర్చునే వసతి ఉండటంతో ఈ వేడుకకు భారీగా అభిమానులు హాజరుకానున్నారు.


ఇక 6 రోజులో ఉండటంతో టీమ్ కుడా కొత్త వేదికను ఏర్పాటు చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ విషయంలో మెగా టీం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినా, వాయిదా వేయటం కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.


Update on Khaidi No 150 Pre Release Event

2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీగా వస్తోన్న ఖైదీనంబ‌ర్ 150 చిత్రం రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు యు /ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 9 ఏళ్ళ తర్వాత చిరు మళ్ళీ వెండి తెరపై ఫుల్ ప్లెడ్జ్ డ్ గా కనిపించనుండడంతో ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రానికి చెందిన అభిమానులే కాక ప్రక్క రాష్ట్రాల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ఆడియో సాంగ్స్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంటే వెండితెరపై అన్నయ్య చేసే రచ్చ ఎలా ఉంటుందా అని అభిమానులు అంచనా వేస్తున్నారు. వివి వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటించగా, తరుణ్ అరోరా విలన్ గా కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసాడు.

English summary
The venue and date for the pre-release event of the film, Khaidi No 150 has been changed according to latest reports. The function which was earlier planned to happen on January 4th will now reportedly be held on January 7th. Even the venue has been changed from Vijayawada to Guntur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu