పవన్-త్రివిక్రమ్ మూవీలో మరో స్టార్ హీరో
'కాటమరాయుడు' సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.
'కాటమరాయుడు' సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్ సైతం ప్రచారంలో ఉంది. ఈ చిత్రం గురించి ఇప్పుడో హాట్ న్యూస్ చెప్పబోతున్నాం. మీరు విని ఆశ్చర్యపోయే న్యూస్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర కీలకమైన పాత్రను పోషించారు. ఆ అనుబంధంతో వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











