»   » దీపికా పదుకోనే 'కంత్రీమొగుడు' ఎప్పుడొస్తున్నాడంటే...

దీపికా పదుకోనే 'కంత్రీమొగుడు' ఎప్పుడొస్తున్నాడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే, కన్నడ హీరో ఉపేంద్ర కాంబినేషన్‌తో రెడీ అవుతున్న 'కంత్రీ మొగుడు' 19న రిలీజ్ అవుతోంది. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు చిత్రం పోలికలుతో ఈ చిత్రం ముందుకువెళ్తుంది. ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ డైరక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని శ్రీ ఉమామహేశ్వర ఫిలిమ్స్ పతాకంపై రూపకుమార్ వి అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి సమర్పకుడు డి గోపాలకృష్ణ మాట్లాడుతూ..."ఇది లవ్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్. ఎంతో రిచ్‌గా సినిమా తయారయ్యింది. ఒక వైవిధ్యమైన కథాంశంతో, సరికొత్త కథనంతో రూపొందిన ఈ సినిమాలో దీపిక అందంచందాలు, అభినయం ప్రత్యేకాకర్షణ. సినిమాలో ఐదు పాటలున్నాయి. ఒక్కో పాటని ఒక్కో దేశంలో మనోహరంగా చిత్రీకరించారు. ఈ పాటలతో పాటు మాస్ ప్రేక్షకుల్ని అలరించే మూడు ఫైట్లు కూడా ఇందులో ఉన్నాయి" అని చెప్పారు. అంజలి మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు: భారతీబాబు, సంగీతం: రాజేశ్ రామ్‌నాథ్, కూర్పు: నాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇంద్రజిత్ లంకేశ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu