twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదం కొలిక్కివచ్చింది...ఈ రోజే రిలీజ్

    By Srikanya
    |

    బెంగళూరు : తన్వి ఫిలింస్‌ పతాకంపై సి.ఆర్‌.మనోహర్‌ నిర్మాణ సారథ్యంలో రూపొందిన శివం సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం నుంచి వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తొలుత బసవణ్ణ పేరును ఖరారు చేయగా ఒక వర్గం ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆతరువాత బ్రాహ్మణ అనే పేరును అనుకున్నారు.

    దానికి కూడా అభ్యంతరం వ్యక్తం కావడంతో కేవలం అడ్డనామాల చిహ్నాన్నే సినిమా పేరుగా అనుకున్నారు. చివరకు శివం పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ఉపేంద్రది ద్విపాత్రాభినయం. రాగిణి, సలోని జంటగా నటించారు.

    కన్నడ నటుడు ఉపేంద్ర గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. విలక్షణమైన సినిమాలు తీసే ఈయన సినిమాల కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే పలు వివాదాల్ లో ఇరుక్కునప్న ఈచిత్రం తాజాగా ఫస్ట్ లుక్ విషయంలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది. మొదట ఈ చిత్రం టైటిల్ 'బసవణ్ణ' వివాదాని దారి తీసింది.

    Upendra’s ‘Shivam’ to release on 2nd Jan 2015.

    ఈచిత్రం 12వ శాతాబ్దానికి చెందిన ఓ సామాజిక సేవకుడి కథ. దీంతో ఈ టైటిల్‌పై 'బసవణ్ణ' కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేసారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో ఉపేంద్ర కత్తి పట్టుకుని ఉండటంతో మరోసారి వివాదం రాజుకుంది. సినిమాలో బసవణ్ణను అభ్యంతరకరంగా చూపించబోతున్నారనే ప్రచారం మొదలైంది. అయితే ఉపేంద్ర అభిమానులు మాత్రం ఇలాంటి వివాదాలే సినిమాకు ఎక్కువ ప్రచారం కల్పిస్తాయని సంతోషంగా ఉన్నారు.

    ఈ చిత్రంలో పాత్రకు తగిన విధంగా శరీరాకృతి రావడం కోసం ఉపేంద్ర చాలా కష్టపడ్డట్లు స్పష్టం అవుతోంది. తాజాగా విడుదలైన పోస్టర్లో ఆయన శరీరాకృతి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి బాడీ షేప్ రావడం కోసం కొన్ని నెలల నుంచి కష్టపడుతున్నాడట ఉపేంద్ర. ఎప్పుడూ పొడవాటి వెంట్రుకలతో కనిపించే ఉపేంద్ర ఈచిత్రంలో పాత్రకు తగిన విధంగా గుండుతో కనిపించబోతున్నాడు.

    ఈ చిత్రంలో ఉపేంద్ర వేసుకునే కాస్ట్యూమ్స్ హైదరాబాద్ కు చెందిన కాస్ట్యూమ్ డిజైన్ బాబీ డిజైన్ చేసారు. ఉపేంద్ర న్యూ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి దండుపాళ్యం చిత్ర దర్శకుడు శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ....‘ఈ సినిమా స్టోరీకి తగిన విధంగానే టైటిల్ పెట్టాం. కాంట్రవర్సీ సృష్టించాలనే ఉద్దేశ్యంతో మాత్రం కాదు' అని దర్శకుడు స్పష్టం చేసాడు.

    శ్రీనివాసమూర్తి, గీతా, భవ్య, సి.ఆర్‌.గోపి, శివరాం, రవిశంకర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, శరత్‌ లోహితాశ్వ, ముని, కిట్టి ప్రధాన తారాగణం. మాటలు- గురురాజ్‌.ఎం.దేశాయ్‌, సాహిత్యం- కె.కల్యాణ్‌, నాగేంద్ర ప్రసాద్‌, ఫొటోగ్రఫీ- వెంకట్‌ ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- శ్రీనివాసరాజు.

    English summary
    The Upendra-starrer Shivam’ is all set to release on 2nd Jan 2015. ‘Shivam’ is cut short by four minutes by the censor board, director Srinivas Raju is a disappointed that he is not able to portray what he intended to do. Movie to release on 2nd Jan 2015. Fans are eagerly waiting for the movie after all the hype, controversy, and Ragini Dwivedi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X