»   » ఇది చూసి నవ్వీ నవ్వీ చచ్చిపోతారు: బాలీవుడ్ పై అమెరికన్ల ప్రేమ (వీడియో)

ఇది చూసి నవ్వీ నవ్వీ చచ్చిపోతారు: బాలీవుడ్ పై అమెరికన్ల ప్రేమ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికన్ల నోట బాలీవుడ్‌ డైలాగులు చెబితే ఎలా ఉంటుందోనన్న ఓ వీడియో ఒకటి ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది.న్యూఢిల్లీలోని యూఎస్‌ రాయబార కార్యాలయం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా పడీపడి నవ్వుతున్నారు. యూఎస్ ఎంబసీలోని అధికారులంతా బాలీవుడ్ సినిమా ఆడిషన్ కు హాజరై, హిందీ సినిమా డైలాగులు చెబితే ఎలా ఉంటుందన్నది ఈ వీడియో ఇతివృత్తం.

న్యూఢిల్లీలోని యూఎస్‌ రాయబార కార్యాలయం తన ట్విట్టర్‌లో నిన్న ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఎంబసీ అధికారులంతా కలిసి బాలీవుడ్‌ అడిషన్లకు హాజరైతే ఎలా ఉంటుంది అన్నదే ఆ వీడియో. కళాఖండ చిత్రం 'షో'లోని గబ్బర్‌ సింగ్‌ నోటి నుంచి వచ్చే పాపులర్‌ డైలాగ్‌ అరే వో సాంబా కిత్‌నే ఆద్మీ తే.. డైలాగును ఓ పెద్దాయన కిత్‌నే ఆద్మీ తే అంటూ కొరడా ఝుళిపించి చెప్పారు.

ఇక షారూఖ్‌ ఓం శాంతి ఓం లోని ఏక్‌ చుట్కీ సింధూర్‌ డైలాగ్‌ను ఓ మహిళా ఉద్యోగితో చెప్పించారు. నమక్‌ హలాల్‌, దీవార్‌ చిత్రాల్లోని పాపులర్‌ డైలాగులను కూడా వాళ్లు అవలీలగా చెప్పేశారు. వీ లవ్‌ బాలీవుడ్‌ అంటూ ఫన్నీ అడిషన్‌ వీడియోను యూఎస్‌-ఇండియాదోస్తీ హ్యాష్‌ ట్యాగ్‌ తో షేర్‌ చేయగా అది వైరల్ అవుతోంది. వారి ప్రయత్నాన్ని అభినందిస్తున్న నెటిజన్లు...ఈ సారి తలైవా తమిళ డైలాగులు ట్రై చేయండని సలహా ఇస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి.

English summary
The US Embassy in India has released a video showing its employees auditioning for roles in the Hindi movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu