»   » ‘ఉత్తమ విలన్’ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)

‘ఉత్తమ విలన్’ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో ‘ఉత్తమ విలన్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల కాగా, తాజాగా తెలుగు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు.

ఏప్రిల్ 10న ఈ సినిమా తెలుగులో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేం ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానున్న ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కమల్ హాసన్ ఈ చిత్రంలో రంగస్థల కళాకారుడిగా, సినీ నటుడిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

Uttama Villain ( Telugu) Theatrical Trailer

ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకే పరిమితం కాకుండా...స్క్రిప్టు వర్క్, డైలాగ్స్ కూడా రాసారట. ఇందులో ఆయన పోషించిన ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. 

English summary
Watch Uttama Villain ( Telugu) Theatrical Trailer.Starring Kamal Hassan, Jayaram, Andrea Jeremiah, Pooja Kumar, Nassar, Parvathi, Parvathy Nair and Urvashi. Directors K. Viswanath and K. Balachander plays cameo roles. Directed by Ramesh Aravind and Produced by C Kalyan. Music Composed by M. Ghibran.
Please Wait while comments are loading...