»   »  రవితేజ సిక్స్ ప్యాక్‌పై....ఉత్తేజ్ ఫన్నీ కామెంట్!

రవితేజ సిక్స్ ప్యాక్‌పై....ఉత్తేజ్ ఫన్నీ కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ ఆ మధ్య బాగా సన్నబడ్డ సంగతి తెలిసిందే. ఇపుడు మాత్రం సిక్స్ ప్యాక్ బాడీ పెంచేసాడు. ఈ నేపథ్యంలో రవితేజకు సన్నిహితుల్లో ఒకరైన నటుడు ఉత్తేజ్ తనదైన రీతిలో పొయెటిక్ గా కామెంట్ చేసారు. రవితేజ సిక్స్ ప్యాక్ బాడీపై ఆయన ఏం కామెంట్ చేసారో చూద్దాం.

 Uttej comment about Ravi Teja's Six Pack

అప్పుడు సన్నబడ్డాడు....ఇపుడు సానబట్టాడు
అప్పుడు పీక్కు పోయాడు....ఇపుడు 'పీక్'కి వెళ్లాడు
అప్పుడు బాలేడబ్బా...ఇపుడు భలే ఉన్నాడబ్బా
అపుడు నవ్వాడు...ఇప్పుడూ నవ్వాడు
ఆనవ్వాపడు....తనాపడు... అందుకే 'రవితేజ'
అశ్వం తానే..ఆశయంబు తానే...రౌతూ తానే..
కాలం కొలిమిలో
ఎర్రని మంటల్లో
'రవితేజ'మై ఉందయించి
అగ్నిశిఖయై ప్రజ్వరిల్లి
సమ్మెటపోట్లకి
ఉలిదెబ్బలకి
తన దేహాన్ని దాసోహం చేసాడు
'అరడజను' మడతెట్టేసాడు
ఆర్డర్ తనదే...
ఆన్సర్ తనదే..
వఠ్ఠి పని రాక్షసుడు..
లవ్ యూ డార్లింగ్
-ఉత్తేజ్

 Uttej comment about Ravi Teja's Six Pack

త్వరలో రవితేజ... 'అలా మొదలైంది' నిర్మాత దామోదర ప్రసాద్ నిర్మాణంలో ఓ చిత్రం ప్రారంభించనున్నారు. తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశాడు. కిక్ 2 సినిమాలో రవితేజ క్యారెక్టర్ పేరు రాబిన్ హుడ్. ఇప్పుడు ఇదే పేరును తన నెక్ట్స్ సినిమాకు టైటిల్ గా ఫైనల్ చేశాడు రవితేజ. చక్రి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఈ టైటిల్ ..సినిమాకు కిక్ ఇచ్చిందని అభిమానులు అంటున్నారు. రవితేజ సిక్స్ ప్యాక్ బాడీ పెంచేది కూడా ఈ సినిమా కోసమే అని టాక్.

బెంగాల్ టైగర్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన రవితేజ వేణు శ్రీరామ్ తో అనుకున్న 'ఎవడో ఒకడు' సినిమా ఆగిపోయింది. దిల్ రాజు తో కథా విషయంలో సెట్ కాకే ప్రాజెక్టు ప్రారంభమై ఫస్ట్ షెడ్యూల్ లోనే ఫుల్ స్టాప్ పెట్టేసారు. దాంతో వెంటనే మరో ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించాలని రవితేజ ఇలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాతో పాటు మరో సినిమాలోనూ నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినరని వినపడుతోంది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్‌తో కలసి వర్క్ చేసేందుకు రవితేజ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో చిత్రం రాబోతోంది.

English summary
Actor Uttej comment about Ravi Teja's Six Pack. Mass Maharaja changed his body shape with new six pack look for his tentatively titled Robinhood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu