»   » మాజీ లవర్‌ కోసం 4 రోజులు కేటాయించిన హన్సిక!

మాజీ లవర్‌ కోసం 4 రోజులు కేటాయించిన హన్సిక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన హన్సిక ఆ మధ్య తమిళ హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించిన సంగతి తెలిసిందే. వీరిమధ్య చాలా ఘాటైన ప్రమాయణం సాగింది. అయితే ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో విబేధాలు రావడంతో బ్రేకప్ అయింది. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ‘వాలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

ఫైనాన్షియల్ సమస్యల కారణంగా ఆగి పోయింది. రెండేళ్లుగా ఈ చిత్రం అలానే ఉండి పోయింది. సినిమాకు సంబంధించిన ఓ సాంగు కూడా బ్యాలెన్స్ ఉంది. తాజాగా సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మిగిలి ఉన్న పాటను పూర్తి చేయడానికి హన్సికను సంప్రదించారు. తన మాజీ లవర్ శింబుతో సాంగు షూటింగులో పాల్గొనడానికి హన్సిక నాలుగు రోజుల డేట్స్ కేటాయించింది. 

Vaalu movie is schedule for July 17th release

గతంలో శింబుతో ప్రేమాయణం సాగించిన నయనతార.... అతనితో విడిపోయి చాలా కాలం పాటు అతనితో నటించడం మానేసింది. ఈ మధ్యనే మళ్లీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. శింబు, హన్సిక కలిసి ప్రస్తుతం ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు కూడా. ఇపుడు హన్సిక కూడా అదే చేసింది.

‘వాలు' చిత్రాన్ని జులై 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాలు చిత్రానికి విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు, హన్సిక, సంతానం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అన్ని ఇబ్బందులను తొలగించుకుని సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంపై శింబు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

English summary
Vaalu movie is schedule for July 17th release. Vaalu is an upcoming Tamil action comedy film written and directed by debutant Vijay Chander. The film features Silambarasan and Hansika Motwani in the lead roles, with Santhanam, VTV Ganesh and Brahmanandam in other supporting roles.
Please Wait while comments are loading...