»   » 'వచ్చాడయ్యో సామి' సాంగ్ ప్రోమో.. కన్నుల పండగే, పంచెకట్టుతో మహేష్ అదిరిపోలా!

'వచ్చాడయ్యో సామి' సాంగ్ ప్రోమో.. కన్నుల పండగే, పంచెకట్టుతో మహేష్ అదిరిపోలా!

Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 20 ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు రంగం సిద్ధమైంది. మహేష్ చివరి రెండు చిత్రాలు నిరాశపరిచినా ఈ చిత్రంతో రికార్డులు కొల్లగొడుతాడని అంచనాలు వేస్తున్నారు. కొరటాల, మహేష్ బాబు సూపర్ హిట్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందడంతో అభిమానుల్లో కనివిని ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి.

తాజగా ఈ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'వచ్చాడయ్యో సామి' ప్రోమో విడుదల చేసారు. మహెష్ తన ట్విట్టర్ వేదికగా ఈ సాంగ్ ప్రోమోని విడుదల చేయడం విశేషం. ఈ సాంగ్ అభిమానులకు కన్నుల పండుగగా ఉంది. పంచె కట్టులో మహేష్ అలరిస్తున్నాడు. వచ్చాడయ్యో సాంగ్ భరత్ అనే నేను ఆల్బంలోనే సూపర్ హిట్ గా నిలిచింది.

Vachaadayyo Saami song promo from Bharat Ane Nenu is released

దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కైరా అద్వానీ ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆమెకు తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. భరత్ అనే నేను చిత్రంపై అటు అభిమానుల్లో, ఇటు సినీవర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

English summary
Vachaadayyo Saami song promo from Bharat Ane Nenu is released. Bharat Ane Nenu all set for grand release
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X