twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'అన్న' అచ్యుత్ మరణం.. వకీల్ సాబ్ జడ్జి మీర్ కీలక వ్యాఖ్యలు !

    |

    పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా కి మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకు వెళుతోంది. అయితే రిలీజ్ అయి పోయి చాలా రోజులు అవుతున్న నేపద్యంలో థియేటర్లలో కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ విషయంలో ఇంకా వెనకడుగు వేయడం లేదు ఇప్పటికి కూడా ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఉంది. తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమాలో జడ్జి పాత్రలో నటించిన మీర్ తెలుగు దివంగత నటుడి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు

    ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు

    చాలా కాలంగా ఇండస్ట్రీలో అనేక సినిమాలకు, సీరియల్స్ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన మీర్ వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ కారణంగా ఈ సినిమాలో జడ్జి పాత్రలో నటించాడు. వకీల్ సాబ్ సినిమాలో జడ్జిగా నటించిన ఆయన సెకండాఫ్ మొత్తం ఎక్కువ స్క్రీన్ స్పేస్ సంపాదించి ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. దీంతో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆయనతో ఇంటర్వ్యులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక ఇంటర్వ్యూలో మీర్ తనతో కలిసి పని చేసిన అచ్యుత్ మరణం గురించి స్పందించారు.

    డిప్రెషన్లోకి వెళ్లడంతోనే!

    డిప్రెషన్లోకి వెళ్లడంతోనే!

    ఆయన ఎలా చనిపోయాడు అనే అంశం తనకు కూడా తెలియదు అని కాకపోతే తనకు తెలిసింది మాత్రమే చెబుతానని ఆయన పేర్కొన్నారు. సినిమాలు, సీరియల్స్ లో బాగా సంపాదిస్తున్న ఆ డబ్బు అంతా వేరే వ్యాపారంలో పెట్టుబడి పెట్టారని అయితే అక్కడ నష్టాలు రావడంతో దానివలన ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారని చెప్పుకొచ్చారు. అలా డిప్రెషన్లోకి వెళ్లడంతో ఆయన అనారోగ్యం పాలయి మరణించారు. అచ్యుత్ చనిపోవడానికి కారణం వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే అంతకు మించి తనకు ఏమీ తెలియదని బహుశా అదే జరిగి ఉండొచ్చని అన్నారు. తెలియని వాటి గురించి ప్రస్తావించడం సరికాదని మీరు చెప్పుకొచ్చారు.

    ఇప్పటికీ గుర్తుపట్టేస్తారు

    ఇప్పటికీ గుర్తుపట్టేస్తారు

    చాలా తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న అచ్యుత్ చనిపోయి 20 ఏళ్లకు పైగా గడుస్తున్నా ఇప్పటికీ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే జనాలు ఆయనను గుర్తుపట్టేస్తారు. అంతలా ఆయన గుర్తింపు సంపాదించారు. 90లలో దూరదర్శన్ తోపాటు ఈటీవీ లో మొదలైన సీరియల్స్ లో ఎక్కువగా నటించి ఫేమస్ అయ్యాడు. ఆ తరువాతి కాలంలో సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అప్పటి బడా హీరోలందరితోనూ నటించారు.

    కానీ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆయన 42 ఏళ్లకు మరణించారు. 2002 డిసెంబర్ 26వ తేదీన గుండె నొప్పి కారణంగా మరణించారు. వ్యాపారంలో అప్పులు పాలు కావడంతో మానసిక ఒత్తిడి పెరిగి పోయి అది గుండెపోటుకు దారి తీసిందని అప్పట్లో ఆయనతో పనిచేసిన కొందరు చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా అచ్యుత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

    English summary
    Actor achyuth passed away at the age 42 years. he acted in many movies and soaps in telugu. unfortunately he passed away. vakeel saab jugde meer said how it happened
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X