twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ఫ్యాన్స్..! డూ ఫెస్టివల్స్ , దయాగాడి దండయాత్ర.! ఇప్పుడు ఇంగ్లీష్ నావల్ గా

    యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రం టెంప‌ర్. అప్ప‌టివ‌ర‌కూ వ‌రుస ఫెయిల్యూర్స్ లో ఉన్న తార‌క్ కు ఆ సినిమా మంచి ఎన‌ర్జీని ఇచ్చింది. క‌మ‌ర్శియ‌ల్ గాను సినిమా పెద్ద స‌క్సెస్ అయింది.

    |

    యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రం టెంప‌ర్. అప్ప‌టివ‌ర‌కూ వ‌రుస ఫెయిల్యూర్స్ లో ఉన్న తార‌క్ కు ఆ సినిమా మంచి ఎన‌ర్జీని ఇచ్చింది. క‌మ‌ర్శియ‌ల్ గాను సినిమా పెద్ద స‌క్సెస్ అయింది. పూరీజగన్నాథ్- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఫిల్మ్ టెంపర్. ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన మెట్టు ఎక్కేసింది.

    `టెంప‌ర్` టర్నింగ్ పాయింట్

    `టెంప‌ర్` టర్నింగ్ పాయింట్


    వరస డిజాస్టర్‌తో కొట్టుమిట్టాడుతున్న ఎన్టీఆర్‌కి `టెంప‌ర్` టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన ఈ చిత్రం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తెగ అలరించింది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో నవలల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం చూశాం.

    ప్రపంచం లోనే టాప్ పబ్లిషర్

    ప్రపంచం లోనే టాప్ పబ్లిషర్

    కాని ఈ సారి వినూత్నంగా ఓ సినిమా కథ నవలా రూపంలోకి మారనుందని అంటున్నారు. మరి ఆ గౌరవం మన తెలుగు సినిమాకి దక్కడం విశేషం. గతం లోనూ టాలీవుడ్ లో వెండితెర నవల లు మామూలే అయినా... ఒక తెలుగు సినిమా ఏకంగా ఇంగ్లిష్ లోకి వెళ్ళటం, ప్రపంచం లోనే టాప్ పబ్లిషర్ లలో ఒకటైన బ్లూమ్స్ బెర్రీ దీన్ని పబ్లిష్ చేయటమూ మామూలు విషయం కాదు.

    నవలల ఆధారంగా సినిమాలు

    నవలల ఆధారంగా సినిమాలు

    ఈ సినిమాకి కథను అందించిన వక్కంతం వంశీ .. తాజాగా ఆ కథకి నవలా రూపాన్ని ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అయిన 'హారీ పోట్టర్' సిరీస్ ను పబ్లిష్ చేసిన 'బ్లూమ్స్ బెర్రీ' సంస్థ, ఈ నవలను పబ్లిష్ చేయడానికి ముందుకు రావడం విశేషం. గతంలో నవలల ఆధారంగా సినిమాలు తెరకెక్కి ఎంతో ఆదరణ పొందాయి. అలాంటిది ఒక తెలుగు సినిమా .. నవలా రూపాన్ని సంతరించుకుంటూ ఉండటం మరో విశేషంగానే చెప్పాలి.

    హాలీవుడ్ నవల రూపంలో

    హాలీవుడ్ నవల రూపంలో

    టెంపర్ సినిమా హాలీవుడ్ నవల రూపంలో రాబోతుండడమే ఇప్పుడు హాట్ న్యూస్ అయింది. ఏమంత గొప్ప కథ అని నవల రూపంలో వస్తోందని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వంశీ చెప్పిన సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెతిస్తోంది. నిజానికి టెంపర్ లో చూపించిన కథ కంటే ఒరిజినల్ కథ చాలా బాగుంటుందని తెలుస్తోంది.

    క్లయిమాక్స్ అద్భుతంగా

    క్లయిమాక్స్ అద్భుతంగా

    ఆ టోటల్ స్టోరీతోనే ఇప్పుడు నవల రాబోతోందట. టెంపర్ సినిమాలో దయ పాత్ర పోషించాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు క్లయిమాక్సే కీలకం. అలాంటి కీలకమైన క్లయిమాక్స్ ను నవలలో కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశాడట రచయిత వక్కంతం వంశీ. త్వరలోనే టెంపర్ ఆంగ్ల నవల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి రానుంది.

    English summary
    Screen adaptations of books are common. But ace screenwriter Vakkantam Vamsi has turned that trend on its head by adapting NTR-starrer Temper into a novel in English.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X