»   » జూ. ఎన్టీఆర్ ఇచ్చింది మామూలు ఆఫర్ కాదు

జూ. ఎన్టీఆర్ ఇచ్చింది మామూలు ఆఫర్ కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : "దర్శకుడిగా నా తొలి చిత్రంలోనే ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయబోవడం అనేది నాకు మామూలు అవకాశం కాదు. 'ఎన్టీఆర్ ఓ మంచి డైరెక్టర్‌ని పరిచయం చేశాడు' అనుకోవాలని ఆయన చెప్పాడు. తనే వ్యక్తిగతంగా నాకు అడ్వాన్స్‌నిచ్చాడు. ఎవరు చేస్తారలా!'' అని చెప్తున్నారు వక్కంతం వంశీ.

'ఊసరవెల్లి' చేసేప్పుడు తన సినిమాతోటే నేను డైరెక్టర్ కావాలని ఫిక్సయ్యాడు ఎన్టీఆర్. 'వంశీ మంచి డైరెక్టర్ అవుతాడు' అని అప్పట్నించే ఆయన చెబుతూ వస్తున్నాడు. దాని కోసం ఒకటిన్నర సంవత్సరం నుంచీ చాలా లైన్లు అనుకుంటూ ఫైనల్‌గా ఓ మంచి కథను తయారు చేసుకున్నాను. 'ఇలాంటి సినిమా చేశాను' అని నేను తలెత్తి గర్వంగా చెప్పుకునేట్లు ఉంటుంది. కొత్తరకంగా, ఎన్టీఆర్ ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేసేవిధంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి డైరెక్ట్ చేయడమే అన్నారు.

స్టార్ హీరోల సినిమాలకు కథలు అందించిన రచయితగా పేరు తెచ్చుకున్న ఆయన త్వరలోనే దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. తొలి చిత్రంలోనే ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ విషయమై మీడియా వారితో పంచుకున్నారు.

అలాగే ...కథకుడిగా నా మొదటి సినిమా 'అశోక్'. ఆ కథను మొదట ఎన్టీఆర్‌కు వినిపించాను. అదివరకు 'భక్త మార్కండేయ' సీరియల్‌లో తను మార్కండేయునిగా నటిస్తే, నేను విలన్‌గా చేశాను. నేను చెప్పిన కథ ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. 'అతనొక్కడే'తో అందరి దృష్టినీ తనవేపుకు తిప్పుకున్న డైరెక్టర్ సురేందర్‌రెడ్డికి ఆ కథ చెప్పమంటే చెప్పాను. రచయితగా నా సినీ జీవితంలో అలా మొదలైంది అన్నారు.

తన చేతిలో ఉన్న ప్రస్తుత ప్రాజెక్టుల గురించి చెప్తూ...ప్రస్తుతం నా కథతో రామ్‌చరణ్ సినిమా 'ఎవడు' తయారవుతోంది. ఇందులో బన్ని కనిపించేది పది నిమిషాలే. అలాంటప్పుడు అది హాలీవుడ్ 'ఫేస్-ఆఫ్'కి కాపీ ఎలా అవుతుంది? 'ఫేస్-ఆఫ్'లో నికొలస్ కేజ్, జాన్ ట్రవోల్టా సినిమా అంతా ఉంటారు. 'ఎవడు' కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. నాలుగేళ్ల క్రితమే తయారు చేసుకున్న ఐడియా అది. అల్లు అర్జున్, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌తో తెరకెక్కబోతున్న 'రేసుగుర్రం'కూ, గోపీచంద్ హీరోగా బి. గోపాల్ డైరెక్ట్ చేయబోతున్న సినిమాకూ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నా. అలాగే రవితేజ, సురేందర్ మరోసారి కలిసి చేయబోతున్న 'కిక్ 2'కు కథనిచ్చాను అన్నారు.

English summary
Vakkantham Vamsi is all set to handle the megaphone as well. Vamsi has narrated a story to none other than Junior NTR. And he was impressed with Vamsi and gave an immediate nod it seems. But Vamsi who provided stories for Juniro’s ‘Ashok’ and ‘Oosaravelli’ have bombed at box office. Let’s hope the third attempt would work and bring success to Vamsi as director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu