»   » అన్యాయం జరుగుతోంది కాబట్టే... ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ సైతం అదే దారి!

అన్యాయం జరుగుతోంది కాబట్టే... ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ సైతం అదే దారి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమలో రచయితలకు సరైన గుర్తింపు లభించడం లేదు. మేము కష్టపడి కథ రాస్తే... కనీసం క్రెడిట్ ఇవ్వకుండా కొందరు దర్శకులు తమకు అన్యాయం చేస్తున్నారు. తమ కష్టానిిక తగిన ప్రతిఫలం కానీ, గుర్తింపు కానీ లభించడం లేదు, అందుకే దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాం... అంటూ ఈ మధ్య కాలంలో పలువురు స్టార్ రైట్స్ మీడియా ముఖంగా తన అసంతృప్తి వెల్లగక్కుతున్న సంగతి తెలిసిందే.

గతంలో కోన వెంకట్....దర్శకుడు శ్రీను వైట్ల మీద ఇదే రకమైన అసంతృప్తిని వెల్లగక్కారు. 'జనతా గ్యారేజ్' దర్శకుడు కొరటాల శివ సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రచయితగా ఉన్నపుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తాను దర్శకుడిగా మారడానికి ప్రధాన కారణం కూడా రచయితగా తనకు తగిన గుర్తింపు లభించక పోవడమే అని స్పష్టం చేసారు.

తాజాగా మరో స్టార్ రైటర్ ఇలాంటి కామెంట్సే చేసారు. కిక్, రేసు గుర్రం, టెంపర్ లాంటి విజయవంతమైన చిత్రాలకు కథ అందించిన వక్కతం వంశీ తాను తన మనసులోని అసంతృప్తిని బయట పెట్టారు.

 అన్యాయం జరిగుతోంది కాబట్టే..

అన్యాయం జరిగుతోంది కాబట్టే..

రచయితలకు సినీ పరిశ్రమలో తగిన న్యాయం జరుగడం లేదని, ఎక్కువ సందర్భాల్లో అన్యాయమే జరుగుతోందని... అందుకే తాను కూడా దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు వక్కతం వంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

తగిన గుర్తింపు లేదు

తగిన గుర్తింపు లేదు

సినిమా ప్రమోషన్లలో తమకు తగిన గుర్తింపు లభించడం లేదని, హీరో ఎవ‌రో, ద‌ర్శ‌కుడు ఎవ‌రో, సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రో అంద‌రికీ తెలుస్తుంది కానీ ఆ సినిమా ర‌చ‌యిత ఎవ‌రో తెలియ‌డం, మా గురించి అసలు మాట్లాడటం లేదు. ఆత‌ర్వాత ఆడియో ఫంక్ష‌న్ లో నీ పేరు చెప్ప‌డం మ‌ర‌చిపోయాను అని కొందరు దర్శకులు సారీ చెప్పే ప్రయత్నం చేస్తారు అంటూ వక్కతం తన మనసులోని మాట బయట పెట్టాలరు.

ఫట్టయితే అలా, హిట్టయితే ఇలా

ఫట్టయితే అలా, హిట్టయితే ఇలా

కొన్ని సార్లు రచ‌యిత రాసిన క‌థ స‌గం మార్చేస్తారు. ఇదేమిటి అని అడిగితే...హీరో ఇలాగే కావాలి అన్నాడు అంటారు. హిట్టయితే దర్శకుడి పేరు వేసుకుంటాడు. సరిగా ఆడక పోతే మాపై తోసేస్తారు అంటూ వక్కతం వంశీ చెప్పుకొచ్చారు.

ఒక్కోక్కరికి ఒక్కోలా

ఒక్కోక్కరికి ఒక్కోలా

అంద‌రికి ఇలాగే జ‌రుగుతుంది అని నేను చెప్పడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కోలా జరుగుతుంది. నాకు మాత్రం అన్యాయం జరిగిందనే ఫీలవుతున్నారు. అందుకే నేను దర్శకత్వం వైపు రావాలని నిర్ణయించుకున్నాను.

ఎన్టీఆర్ తో ఉంటుందా?

ఎన్టీఆర్ తో ఉంటుందా?

ఎన్టీఆర్ కు వక్కతం వంశీ చాలా క్లోజ్.... వంశీ దర్శకత్వంలో చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చాడు కూడా. ఇతర ప్రాజెక్టులతో ఎన్టీఆర్ బిజీగా ఉండటం వీళ్ల ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఇప్పట్లో వీరి ప్రాజెక్టు ఓకే అయ్యేలా లేదు.

అల్లు అర్జున్ తో

అల్లు అర్జున్ తో

ఇటీవల వక్కతం వంశీ బన్నీని కలిసి కథ చెప్పాడని, బన్నీకి కథ నచ్చిందని... అయితే అపీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా దర్శకుడిగా మారి కొరటాల శివలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చాలా కసిగా ఉన్నడని స్పష్టమవుతోంది.

English summary
After the fantastic response Vakkantham Vamsi has been receiving for the Junior NTR starrer "Temper", the scriptwriter is now reportedly set to direct a movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu