»   » ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖరారు, అఫీషియల్ పోస్టర్ ఇదిగో

ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖరారు, అఫీషియల్ పోస్టర్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రస్తుతం 'జనతాగ్యారెజ్' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీతో ఈ చిత్రం చేయనున్నారు. గత కొన్ని రోజులుగా పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు సెట్ అయింది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తమ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మించనున్నారు. ఈ మేరకు పోస్టర్ ని ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ట్వీట్ చేసారు కళ్యాణ్ రామ్.

ఇప్పటికే ఆయనతో కథ రెడీ చేసుకోమని చెప్పాడట ఎన్టీఆర్. ప్రస్తుతానికి స్క్రిప్ట్‌పై కుస్తీలు పడుతున్నాడట వక్కంతం వంశీ. రచయితగా ఉన్న వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారెజ్' చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయనున్నారు.

అశోక్, 'ఊసరవెల్లి', 'టెంపర్' సినిమాలతో ఎన్టీఆర్‌కు పవర్ఫుల్ సినిమాలను రాసిన వక్కంతం వంశీ, తాను స్వయంగా దర్శకత్వం వహించే సినిమాకు కూడా అదేస్థాయి స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం.

ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ 2 సినిమాను చేయడానికి అంగీకరించిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి వక్కంతం వంశీ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్, కొరటాల శివ తరహాలో ఘన విజయం సాధించే చిత్రాలు డైరక్ట్ చేయాలని కోకరుకుందాం. బెస్టాఫ్ లక్ వక్కంతం వంశీ.

English summary
Well-known writer Vakkantham Vamsi is turning director. Young Tiger NTR is giving Vakkantham Vamsi chance to turn the director as he promised him long back. The film will be Produced by Kalyan Ram on NTR Arts banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu