»   » జూ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సినిమా!

జూ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి సోదరులు జూ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కలిసి పని చేయబోతున్నారు. నిర్మాతగా ఇప్పటికే పలు చిత్రాలు నిర్మించిన కళ్యాణ్ రామ్ త్వరలో తన సోదరుడు జూ ఎన్టీఆర్ హీరోగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో ఈసినిమా తెరకెక్కబోతోంది.

టాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాలకు కథా రచయితగా తన సత్తా చాటిన వక్కతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారబోతున్నాడు. కిక్, రేసు గుర్రం, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కతం వంశీ ఇప్పటికే ఎన్టీఆర్ కు కథ వినిపించాడు. ఎన్టీఆర్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చాడు.

Vakkantham Vamsi to direct NTR

వాస్తవానికి ‘టెంపర్' కథతోనే వక్కతం వంశీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. అయితే ఎన్టీఆర్ కోరిక మేరకు పూరికి ఆ కథ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నీతో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట కూడా ఇచ్చినట్లు టాక్. ఆ మాట మేరకే ఎన్టీఆర్ ఇపుడు వక్కతం వంశీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘నాన్ను ప్రేమతో' షూటింగులో ఉన్న జూ ఎన్టీఆర్... దీని తర్వాత కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది పూర్తయిన తర్వాత అంటే 2016 వేసవిలో వక్కతం వంశీతో సినిమా మొదలు కానుంది. జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి పని చేయాలని గతేడాదే నిర్ణయించుకున్నారు. ఎట్టకేలకు వీరి కాంబినేషన్లో సినిమా ఖరారైంది.

English summary
Writer Vakkantham Vamsi, known for hits like Temper and Racegurram, is turning director. He has already narrated the script to NTR to which the star agreed. Now, Kalyan Ram’s NTR Arts has come forward to produce the film next year.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu