»   » టాలీవుడ్ రియల్ లైఫ్ లవ్ స్టోరీస్.... (వాలంటైన్స్ డే స్పెషల్)

టాలీవుడ్ రియల్ లైఫ్ లవ్ స్టోరీస్.... (వాలంటైన్స్ డే స్పెషల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
టాలీవుడ్ రియల్ లైఫ్ లవ్ స్టోరీస్

ప్రతి సంవత్సరం ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) రాగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికుల్లో ఏదో తెలియని ఆనందం. తమకంటూ ఓ రోజు ఉందనే ఉత్సాహం. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతీ రోజు ప్రేమికులు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం. ఫిబ్రవరి 14వ తేదీనే ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం రకరకాల కథనాలు ఉన్నాయి.

ప్రేమ కులానికి, సినిమా కులానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ప్రేమికులపై సినిమాల ప్రభావం చాలా ఉంది. పలువురు సినీ తారలు ప్రేమ కథా చిత్రాల్లో నటించడంతో పాటు వివాహాలు చేసుకుని యువతలో ప్రేమ భావనలు రేపుతున్నారు. టాలీవుడ్ స్టార్లు నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్రేమ వివాహాలు చేసుకున్నసంగతి తెలిసిందే.

మహేష్ బాబు, నమ్రత

మహేష్ బాబు, నమ్రత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తనతో పాటు వంశీ సినిమాలో నటించిన బాలీవుడ్ భామ నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించారు. పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

జీవిత రాజశేఖర్

జీవిత రాజశేఖర్

తెలుగు నటి అయిన జీవిత, తమిళ నటుడు అయిన రాజశేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎంతో ఆనందమైన జీవితం గడుపుతున్నారు.

పవన్-రేణు దేశాయ్

పవన్-రేణు దేశాయ్

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తనతో పాటు బద్రి సినిమాలో కలిసి నటించిన రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డారు. అనంతరం కొంతకాలం సహజీవనం చేసిన పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ భార్య భర్తలుగా విడిపోయినా.... వారి మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ ఇంకా అలానే ఉందనేది చాలా మంది అభిప్రాయం.

 శ్రీకాంత్-ఊహ

శ్రీకాంత్-ఊహ

పలు చిత్రాల్లో కలిసి నటించిన నటుడు శ్రీకాంత్, ఊహ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇపుడు హ్యాపీగా ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవితం సాగిస్తున్నారు.

నాగార్జున-అమల

నాగార్జున-అమల

తనతో పాటు పలు చిత్రాల్లో నటించిన నటి అమలను నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికీ ఇప్పటికీ ఈ ఇద్దరిలో ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.

శ్రావణ భార్గవి-హేమచంద్ర

శ్రావణ భార్గవి-హేమచంద్ర

సినిమా గాయకులుగా కలిసి పని చేస్తున్న శ్రావణ భార్గవి, హేమ చంద్ర ప్రేమ వివాహం చేసుకున్నారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయమైన అల్లు అర్జున్, స్నేహా రెడ్డి మధ్య మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

రామ్ చరణ్-ఉపాసన

రామ్ చరణ్-ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమ వివాహం చేసుకున్నారు.

స్నేహ-ప్రసన్న

స్నేహ-ప్రసన్న

తమిళ నటులు అయిన స్నేహ-ప్రసన్న ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.

నాని-అంజన

నాని-అంజన

కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన నటుడు నాని, అంజన మధ్య మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

సూర్య-జ్యోతిక

సూర్య-జ్యోతిక

తమిళ నటుడు సూర్య, నటి జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్నారు.

గీతా మాధురి-నందు

గీతా మాధురి-నందు

తెలుగు సినిమా సింగర్ అయిన గీతా మాధురి, నటుడు నందు ప్రేమ వివాహం చేసుకున్నారు.

నాగ చైతన్య-సమంత

నాగ చైతన్య-సమంత

నాగ చైతన్య, సమంత ప్రేమ వివాహం గత డిసెంబర్లో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

English summary
Love marriages are becoming very popular in the Telugu film industry as a series of young actors are taking this route to settle down in life in recent years. Ram Charan, Bunny, nani, Naga chaitanya, Akhil Akkineni in this love list.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu