»   » ఆమె ప్రేమించింది... అతడు దొరికిపోయాడు: జీవిత రాజశేఖర్ లవ్ స్టోరీ

ఆమె ప్రేమించింది... అతడు దొరికిపోయాడు: జీవిత రాజశేఖర్ లవ్ స్టోరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: సినీ నటులు, దంపతులు రాజశేఖర్, జీవిత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ల లవ్ స్టోరీ చాలా ఆసక్తికరం. రాజశేఖర్ చదివింది మెడిసిన్ అయినా సినిమాలపై ఇష్టంతో ఇటు వైపు అడుగులు వేసారు. ఈ క్రమంలోనే ఆయన జీవిత ప్రేమలో బంధీఅపోయారట.

గతంలో పలు పత్రిక ఇంటర్వ్యూలో వీరు తమ లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఆ విశేషాలు మరోసారి మీ ముందుకు. ఈ ఇద్దరూ తలంబ్రాలు చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. ఇందులో రాజశేఖర్ నెగెటివ్ రోల్ చేసారు.

అమ్మాయిలతో పెద్దగా మాట్లాడే అలవాటు లేని, పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ అబ్బాయి(రాజశేఖర్) జీవితంలోకి జీవిత ప్రవేశించాక అతడి నిర్ణయాలు, అభిప్రాయాలు అన్నీ మారిపోయాయట.

జీవిత పరిచయంతో అంతా మారింది

జీవిత పరిచయంతో అంతా మారింది

పెద్దగా అమ్మాయిలతో మాటాడేవాడిని కాను. అప్పటికే మెడిసిన్ కంప్లీట్ చేసి సినిమాలంటే ఇష్టం కొద్దీ తెరపైకి వచ్చాను. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పేశాను కూడా. యాక్టింగ్ తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. కానీ జీవితతో పరిచయం తన నిర్ణయం మార్చుకునేలా చేసింది. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అన్నారు రాజశేఖర్.

రాజశేఖర్ మీద ఎంత ఇష్టం ఉండేది అంటే

రాజశేఖర్ మీద ఎంత ఇష్టం ఉండేది అంటే

ఆయన్ను నాకు తెలియకుండానే ఇష్టపడేదాన్ని. అతను వేరొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రమేం.. నేను ప్రేమించకూడదని ఏమైనా ఉందా అని ప్రశ్నించేటంత ఇష్టం ఉండేది. మామూలుగా ఉండే నేను కావాలనుకున్న దాని గురించి ఎంత వరకైనా వెళ్తానని అలా అర్ధమైంది. నా ఇష్టం అతనికి నచ్చింది. ఇద్దరం ఒక్కటయ్యాం అని జీవిత తెలిపారు.

ఆమె నన్ను ప్రేమించింది. నేను దొరికిపోయాను

ఆమె నన్ను ప్రేమించింది. నేను దొరికిపోయాను

ఆమె నన్ను ప్రేమించింది. నేను దొరికిపోయాను.. ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే ఉంది. ఆ శక్తి ఎంత గొప్పదనిపిస్తుంది. తను నేనంటే ప్రాణం పెడుతుంది. నాకోసం ఎంతో చేస్తుంది. సర్దుకుపోతుంది. నాకు కోపం ఎక్కువ. మగాళ్లో కనిపించే ఇగో నాలో కూడా ఉంది. కొన్ని సార్లు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లాక కూడా సీరియస్‌గా ఉంటా. ఆ క్షణం ఆమె చాలా కామ్‌గా ఉంటుంది. కోపంతో ఏమైనా అన్నా తనే సారీ చెబుతుంది.. అని రాజశేఖర్ తెలిపారు.

నన్ను ఓ పిల్లాడిలా చూసుకుంది

నన్ను ఓ పిల్లాడిలా చూసుకుంది

హీరోగా బిజీ అయిన తర్వాత ఇంటి బాధ్యత మొత్తం జీవిత తీసుకుంది. నన్ను ఓ పిల్లాడిలా చూసుకుంది. నా అవసరాలన్నీ తీరుస్తుంది. ఇలాటి ఇల్లాలు ఉంటే ఇక కావాల్సిందేముంది? అందుకే నా బలం అంతా జీవితనే...అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

English summary
Valentines Day special: Tollywood actors Rajasekhar-Jeevitha interesting love story. More than just a couple, they are actors, filmmakers, politicians and keen businessmen. Infact, it would be safe to call Jeevitha and Rajasekhar, Tollywood's power couple. Whether it is at filmi events or media interactions, the two are always together.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu