»   » వంశీ, అల్లరి నరేష్ సినిమా మొదలైంది

వంశీ, అల్లరి నరేష్ సినిమా మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి'నరేష్,'అష్టాచమ్మా' ఫేమ్‌ అవసరాల శ్రీనివాస్ లతో ప్రముఖ దర్శకుడు వంశీ 'సరదాగా కాసేపు' అనే చిత్రం రూపొందిస్తున్నారు. శ్రీ కీర్తి కంబైన్స్‌ పతాకంపై ఎంఎల్ పద్మకుమార్‌ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధురిమ హీరోయిన్. రీసెంట్ గా పూజా కార్య క్రమాలతో ఈ చిత్రం చిత్రీకరణ మొదలైంది.ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ...19 నుంచి రాజమండ్రిలో భారీ షెడ్యూల్‌ చేయబోతున్నాం. 20 రోజులు జరిపే ఈ షెడ్యూల్‌ లో కీలక సన్నివేశాలతో పాటు, రెండున్నర పాటలను చిత్రీకరిస్తాం' అన్నారు.

వంశీ శైలిలో సాగే పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా అంతా సరదా సరదాగా ఉంటుంది. చక్రి సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. భాస్కరభట్ల, కంది కొండ, ప్రవీణ్‌ లక్మ ఈ పాటలు రాస్తున్నారు. రెండు పాటల రికా ర్డింగ్‌ పూర్తయింది అన్నారు.

ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్‌, జయలలిత, జీవా, సన, ఎమ్మెస్‌ నారాయణ, కొండవలస, సుభాష్‌, రమ్యశ్రీ, దువ్వాసి మోహన్‌, కృష్ణేశ్వరరావు, టార్జాన్‌, బైజు తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: చక్రి, పాటలు: భాస్కరభట్ల, కందికొండ, ప్రవీణ్‌ లక్మ, కథ: శంకరమంచి, స్క్రిప్టు కో-ఆర్డినేటర్‌: వేమూరి సత్యనారాయణ, మాటలు: పడాల శివ సుబ్రహ్మణ్యం, నృత్యాలు: స్వర్ణ, కూర్పు: బస్వా పైడిరెడ్డి, ఛాయాగ్రహణం: లోకి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu