»   » వంశీ 'తను మొన్నే వెళ్లిపోయింది' స్టోరీ లైన్

వంశీ 'తను మొన్నే వెళ్లిపోయింది' స్టోరీ లైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దర్శకుడు వంశీ సినిమాలంటేనే విభిన్నతకు మారు పేరుగా ఉంటాయి. దాంతో ఆయన చిత్రం వస్తోందంటే ఎదురుచూసే వాళ్లు చాలా మంది ఉంటారు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తను మొన్నే వెళ్లిపోయింది'. అజ్మల్‌, నిఖితా నారాయణ్‌ జంటగా నటించారు. పూర్ణనాయుడు నిర్మాత. షూటింగ్ పూర్తయింది.

చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... ఎదుటివారికి సాయపడటంలోనే తన ఆనందాన్ని వెదుక్కొనే యువకుడు సుశీల్‌. చదువులు పూర్తి చేసుకొన్నాడు. అందుకే ఇంట్లోవాళ్లు ఓ పెళ్లి సంబంధం చూశారు. సిగ్గులు ఒలకబోస్తూ పెళ్లింట్లో అందంగా ముస్తాబై కూర్చుంది సత్య. కాబోయే దంపతులు ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొన్నారు. మనసు విప్పి మాట్లాడుకొన్నారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఓ అమ్మాయిని వెదికేందుకు ప్రయాణం కట్టారు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఈ జంటకీ, ఆ అమ్మాయికీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

Vamsy's Tanu Monne Vellipoindi film concept

నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ..''వంశీ శైలిలో సాగే చిత్రమిది. త్వరలో పాటలు విడుదల చేస్తాము. వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది. మూడు రోజుల షూటింగ్ మిగిలుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కథకు తగ్గట్టు టైటిల్ పెట్టాం. వంశీ మార్కు సినిమా. చక్రి మంచి స్వరాలందించారు''అన్నారు.

దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ''ఆహ్లాదభరితమైన ప్రేమ కథ. ఓ యువతి కోసం సుశీల్‌, సత్య సాగించే అన్వేషణ విధానం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది''అన్నారు.ఈ చిత్రానికి కెమెరా: ఎమ్వీ రఘు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: వేమూరి సత్యనారాయణ, ఎడిటింగ్: బస్వాపైడిరెడ్డి, సంగీతం: చక్రి.

English summary

 Vamsi’s new directorial with Ajmal in the lead role and Nikitha Narayan as his lady love has been titled Tanu Monne Vellipoyindi . Just like Vamsi’s films, this film is also high on entertainment quotient while the story is based on the elements of love and suspense. Purna Naidu is producing the flick on Saradhi studios banner. Chakri has provided the soundtrack for the film. The film has almost wrapped major shoot is planned to be shot in Rajamundry. M.V.Raghu is cranking the camera and Basva Padireddy is the editor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu