»   » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరుపై విమర్శలు? అడ్డుకోవడం ఆమె తప్పా?

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరుపై విమర్శలు? అడ్డుకోవడం ఆమె తప్పా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... క్రమ శిక్షణకు పెట్టింది పేరు. అయితే ఆయన అభిమానులు మాత్రం అలా ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అందరూ అలా కాక పోయినా కొందరు మాత్రం వారి అత్యుత్సాహం, ప్రవర్తన తీరుతో పవన్ కళ్యాణ్ పేరు చెడగొడుతున్నారు.

మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించి ఏ వేడుక జరిగినా పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిపోవడం మామూలే. ఇక ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ లేక పోతే పరస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.


గతంలో క్లాస్ పీకారు. అయినా....

గతంలో క్లాస్ పీకారు. అయినా....

అయితే మెగా హీరోలకు సంబంధం లేని సినిమా ఫంక్షన్లలో కూడా వీరు పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ గోల చేయడం మెగా ఫ్యామిలీకి ఇబ్బందిగా మారింది. వీరి ప్రవర్తనపై గతంలో నాగబాబు, అల్లు అర్జున్ సభా ముఖంగా క్లాస్ పీకారు కూడా.


తీరు మారలేదు..

తీరు మారలేదు..

ఇటీవల విజయవాడలో జరిగిన ‘వంగవీటి' ఆడియో వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వంగవీటి ఆడియో ఫంక్షన్ ని డస్ట్రబ్ చేస్తూ పవర్ స్టార్ నినాదాలు చేసారు. వేదికపైకి కూడా కూడా వచ్చే ప్రయత్నం చేసారట.


యాంకర్ ఝాన్సీ

యాంకర్ ఝాన్సీ

ఈ ఆడియో వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ ఝాన్సీ పవన్ కళ్యాణ్ అభిమానులకు అలా చేయొద్దని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సహనం కోల్పోయిన ఝాన్సీ వారిని గట్టిగానే మందలించింది.


ఇదేమీ మీరిచ్చే గౌరవం?

ఇదేమీ మీరిచ్చే గౌరవం?

పవన్ కళ్యాణ్ క్రమశిక్షణకు మారు, అలాంటి హీరో పేరును చెడగొట్టడం అంటే ఆయన గౌరవానికి భంగం కలిగించినట్లే.... ఆయనకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ నేరుగా ఝాన్సీ గొడవ చేస్తున్న వారిని ప్రశ్నించారు. ఆడియో వేడుకలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమని ఆమె ఘాటుగా స్పందించారు.


ఝాన్సీని టార్గెట్ చేసారు

ఝాన్సీని టార్గెట్ చేసారు

ఝాన్సీ తమను అడ్డుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఝాన్సీ ఆమె బాధ్యత నిర్వర్తించడంలో భాగంగానే పవన్ కళ్యాణ్ అభిమానులకు తొలుత విజ్ఞప్తి చేసారు, అయినా వారు వినక పోవడంతో కాస్త ఘాటుగా మాట్లాడక తప్పలేదు.


యాంకర్ ఝాన్సీతో నీచంగా..ఎవరు? ఆర్ నారాయణమూర్తి ఎందుకలా?

యాంకర్ ఝాన్సీతో నీచంగా..ఎవరు? ఆర్ నారాయణమూర్తి ఎందుకలా?

యాంకర్ ఝాన్సీ... తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో సీనియర్ యాంకర్. బుల్లితెర తో పాటు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఎన్నో వందల ఎపిసోడ్లకు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
Vangaveeti audio launch: Pawan kalyan Fans Worst behaviour. Anchor Jhansi Fires on Pawan Kalyan Fans at at RGV Vangaveeti Telugu Movie Audio Launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu