»   » సేమ్ అలాగే దించాడు: వర్మ ‘వంగవీటి’లో దేవినేని నెహ్రు పాత్ర... (ఫోటోస్)

సేమ్ అలాగే దించాడు: వర్మ ‘వంగవీటి’లో దేవినేని నెహ్రు పాత్ర... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం వంగ‌వీటి. జీనియ‌స్‌, రామ్‌లీల‌ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ వంగ‌వీటి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

ఇప్పటికే ఈ సినిమాలో వంగవీటి రంగ, వంగవీటి రత్న కుమారి పాత్రలకు సంబంధించిన పాత్రదారుల ఫోటోలను రిలీజ్ చేసారు. తాజాగా సినిమాలో కీలకమైన దేవినేని నెహ్రూ పాత్రలో కనిపించబోతున్న నటుడిని పరిచయం చేసారు. ఈ నటుడి పేరు శ్రీతేజ్. అచ్చుగుద్దినట్లు అలానే ఉన్నాడు కదూ. ఈ ఫోటో చూసిన వారంతా వర్మ సెలక్షనే సెలక్షన్...అంటున్నారు.

 డిసెంబ‌ర్ 23న

డిసెంబ‌ర్ 23న

డిసెంబ‌ర్ 23న వంగ‌వీటి చిత్రం గ్రాండ్‌రిలీజ్ అవుతుంది. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి ఎంతో క్రేజ్ నెల‌కొన్నఈ సినిమా పాట‌ల‌కు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

 అమితాబ్, నాగార్జున

అమితాబ్, నాగార్జున

డిసెంబ‌ర్ 20న `వంగ‌వీటి` సినిమాకు సంబంధించిన వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున‌లు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.

 గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్


ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెలుగులో విడుద‌ల చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకుని ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా అత్య‌ధిక థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు.

 వంగవీటి

వంగవీటి

బ్యానర్ః రామ‌దూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యంః సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోలు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ః మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు,కో ప్రొడ్యూస‌ర్ః సుధీర్ చంద్ర ప‌డిరి,నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శ‌క‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

English summary
Sensational director Ramgopal Varma’s new directorial Vangaveeti is produced by Dasari Kiran Kumar of Genius, Ram Leela fame on Ramadhutha Creations. Vangaveeti completed the censor formalities receiving A certificate and will hit the screens grandly on December 23rd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu