»   » దుర్మార్గం.... ‘వంగవీటి’ మూవీ చూసి మండిపడ్డ రంగ ఫ్యాన్స్

దుర్మార్గం.... ‘వంగవీటి’ మూవీ చూసి మండిపడ్డ రంగ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: వంగవీటి మోహన రంగం జీవితాన్ని బేస్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిన 'వంగవీటి' మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ఈసినిమాలో రంగ గురించి ఎలా చూపించబోతున్నారని విజయవాడ ప్రజలు, విజయవాడలోని రంగ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.

సినిమా చూసిన రంగ అభిమానులు వర్మ మీద మండి పడ్డారు. అసలు ఈ సినిమాకు, రంగ గారికి ఎలాంటి సంబంధం లేదని... మా తాతల చెప్పినట్లు ఈ సినిమాలో ఏమీ లేదు. రంగా గారిని ఒక రౌడీగా చూపించారు. కేవలం డబ్బు కోసమే వర్మ ఈ సినిమా తీసారని మండి పడ్డారు.


Vangaveeti Ranga fans about 'Vangaveeti'

కేవలం డబ్బు కోసం, తన స్వార్థం కోసం, చీప్ పబ్లిసిటీ కోసం రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీసారు... అలాంటి సినిమాకు 'వంగవీటి ' టైటిల్ పెట్టడం దుర్మార్గ మని తెలిపారు. ఇదో అర్థం లేని సినిమా, వ్యాపారం కోసం తీసిని సినిమా.....ఇలాంటి సినిమాకు 'వంగవీటి' ఇంటి పేరు పెట్టి పరువు తీసారు అని రంగా అభిమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేసారు.


రంగా గారిని ఎవరు చంపారో... విజయవాడలో పుట్టిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ ఇందులో మరో రకంగా చూపించారు. ఈ సినిమా 'వంగవీటి' అనే టైటిల్ కంటే 'బెజవాడ-2' అనే టైటిల్ పెడితే బావుండేది విజయవాడకు చెందిన పలువురు అభిప్రాయం పడ్డారు.


వంగవీటి మోహనరంగను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, ఇలాంటి సినిమాలు తీయడం రాంగోపాల్‌వర్మ మానుకోవాలన్నారు పీఆర్పీ మాజీ నేత శోభారాణి. ఈ సినిమాలో కాపు సోదరుల మనోభావాలు దెబ్బతీశారని, దీనిపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని శోభారాణి తెలిపారు.

English summary
Vangaveeti Ranga fans Ram Gopal varma about hos latest movie 'Vangaveeti'. The film is based on the lives of politician Vangaveeti Mohana Ranga, and his brother Vangaveeti Radha Krishna Murthy and their altercation with communist dominated Vijayawada of 1980s Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu