»   » స్టార్ హీరో కూతురు... టాలీవుడ్లో తన ‘శక్తి’ చూపేందుకు వస్తోంది

స్టార్ హీరో కూతురు... టాలీవుడ్లో తన ‘శక్తి’ చూపేందుకు వస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Star Hero Daughter Entry In Tollywood స్టార్ హీరో కూతురు

తమిళ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. 2012లో పోడాపోడి సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ఇప్పటి వరకు తమిళం, మళయాలం, కన్నడలో సినిమాలు చేసింది కానీ... తెలుగులో నటించలేదు.

త్వరలో ఆమె 'శక్తి' అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఫిమేల్ సెంట్రిక్ ప్రాజెక్టుగా మూడు బాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు వెర్షన్ 'శక్తి' ఫస్ట్ లుక్ పోస్టర్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

శక్తి

శక్తి

మహిళలు ఎదుర్కొంటున్న కాంటెపరరీ ఇష్యూలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నెల ద్వితీయార్థంలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎ.ప్రియదర్శిని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. శరణ్య లూయిస్ నిర్మాత.

వరలక్ష్మి

వరలక్ష్మి

వరలక్ష్మి .... అంటే తెలుగు ప్రేక్షకులకు శరత్ కుమార్ కూతురుగా మాత్రమే పరిచయం. ఆ మధ్య విశాల్ ప్రేమలో ఉందనే వార్తలతో హాట్ టాపిక్ అయింది. అంతే కానీ ఆమె సినిమాల గురించి, ఆమె యాక్టింగ్ స్కిల్స్ గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు.

ఆసక్తి

ఆసక్తి

వరలక్ష్మి తొలిసారిగా తెలుగులో నటిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలుగులో శరత్ కుమార్‌కు నటుడిగా మంచి పేరుంది. అయితే తండ్రి నుండి ఆమె నటనను ఏ మేరకు అంది పుచ్చుకుంది అనేది ‘శక్తి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తెలియనుంది.

వరలక్ష్మి హాట్ హాట్

వరలక్ష్మి హాట్ హాట్

వరలక్మి శరత్ కుమార్.... ఇంతకు ముందు విశాల్ లవ్ ఇష్యూతో పాటు, ఇతరత్రా అంశాలతో వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు.

అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Varalaxmi Sarathkumar, daughter of senior Tamil hero Sarathkumar, has announced her debut film in Tollywood. Said to be a multilingual female-centric project, the film is titled "Shakthi" in Telugu. Rana Daggubati unveiled the first look poster of the film's Telugu version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu