»   »  ‘మిర్చి’ రీమేక్: సుదీప్‌తో ఆ హీరో కూతురు

‘మిర్చి’ రీమేక్: సుదీప్‌తో ఆ హీరో కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రాన్ని కన్నడలో సుదీప్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వారం క్రితమే ప్రారంభం అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సుదీప్ సరసన హీరోయిన్‌గా తమిళ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఎంపికైంది.

'పోడా పోడి' అనే తమిళ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన వరలక్ష్మి ఇప్పుడు కన్న ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధం అవుతోంది. ఇప్పటికే వరలక్ష్మి సెక్సీ ఫోటో షూట్లతో కుర్రకారు మతి పోగొడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కన్నడ సినీరంగానికి పరిచయం అవుతుండటం చర్చనీయాంశం అయింది.

గతంలో 'కెంపె గౌడ' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సుదీప్, దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. మిర్చి రీమేక్‌లో నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఈ చిత్ర నిర్మాత ఎన్.ఎం.కుమార్ మీడియాతో మాట్లాడుతూ వరలక్ష్మిని హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయాన్ని వెల్లడించారు.

'సినిమాలోని ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా వరలక్ష్మిని ఎంపిక చేసాం. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది' అని ఎన్.ఎం.కుమార్ తెలిపారు. తెలుగులో విడుదలైన 'మిర్చి' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. తెలుగులో ఈచిత్రం భారీ విజయం సాధించింది.

English summary
Actress Varalaxmi Sarathkumar, who started her acting career with Tamil movie Podaa Podi, is now all set to rock Kannada audience. She will foray into Sandalwood with the untitled Kannada remake of Telugu Blockbuster film Mirchi. The budding actress will romance superstar Kiccha Sudeep in the movie, which went on floors a week ago.
Please Wait while comments are loading...