»   » అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

కుదురుగా కూచోకుండా తనపని వదిలేసినట్టే కనిపిస్తూ అన్నిటిలో పుల్లలు పెట్టే రామ్ గోపాల్ వర్మ నిన్న కూడా ఇలాంటిదే ఒక ప్రయత్నం చేసి కాస్త కంగు తిన్నట్టున్నాడు. ప్రపంచం లో ఏ విషయాన్నీ వదలకుండా చక చక ట్విటర్ కి ఎక్కించే వర్మ ఈ మధ్య డైరెక్టర్ వర్మ గా కంటే ట్విట్తర్ వర్మగానే ఎక్కువ పాపులర్ అయ్యాడు. వర్మ ట్వీట్లకి బలైన వాళ్ళు కొందరైతే, కొందరి పై ట్వీట్లు చేసి వర్మే బలయ్యాడు కొన్నిసార్లు.

ఇక ఇప్పుడు కూడా మన కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఇలాంటి ప్రయత్నమే చేయబోయి...నాలుక కాస్త గట్టికానే కరుచుకున్నట్టున్నాడు... ఇంతకీ మన సారు ఏం చేసారూ అంటే.... అక్కినేని అఖిల్ మీద ఒక ట్వీట్ పెట్టాడు. అదీ అతని పర్సనల్ లైఫ్ మీద. అఖిల్ పెళ్ళిని ఉద్దేశించి పెట్టిన ట్వీట్ లో వెటకారం కంటే "కారం" ఎక్కువ కావటం తో కాస్త మండినట్టే ఉంది. అంతే ఆ మంట వర్మకీ తాకేలా మారటంతో ఎవ్వరికీ భయపడని వర్మ కూడా రాత్రికి రాత్రే ఆ ట్వీట్ నే తొలగించాడు ఇంతకీ మనవర్మ ఏమని ట్వీటాడూ అంటే....

రామ్ గోపాల్‌వర్మ:

రామ్ గోపాల్‌వర్మ:

వర్మ స్టైల్: ఎప్పుడూ తనకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే రామ్ గోపాల్‌వర్మ... ట్విట్టర్‌ వేదికగా చేసుకొని ఎప్పుడూ జనాల నోళ్ళలో నానుతూనే ఉంటాడు. అందరూ ఒప్పుకుంటున్న విషయాన్ని తనకోణం నుంచి చూసి దాన్ని జనం మీదకి వదిలటం వర్మ స్టైల్.

వర్మ చూసే కోణం:

వర్మ చూసే కోణం:

నిజానికి కొన్ని విషయాలలో వర్మ చూసే కోణం అద్బుతంగా ఉంటుంది. అతన్ని వ్యతిరేకించేవారు కూడా కొన్ని విషయాల్లో వర్మతో ఏకీభవించేలా ఉంటాయి కొన్ని అభిప్రాయాలు.

పవన్ కళ్యాణ్ :

పవన్ కళ్యాణ్ :

ఇదివరలో ఒకసారి ‘ఇప్పుడే పవన్ ట్వీట్ చూశాను. తనిచ్చిన స్పీచ్ తనకైనా అర్థమైందా అని నా డౌట్' ‘పవన్ ప్రెస్ మీట్ కొచ్చేటప్పుడు కారులో తన పక్కన కూర్చున్న వారి చెప్పుడు మాటలు విని ఏవేవో మాట్లాడాడు.

ఒక రేంజ్ లో వ్యతిరేకత:

ఒక రేంజ్ లో వ్యతిరేకత:

ఒకసారి జనసేన పార్టీ పెట్టేటప్పుడు ఆయనిచ్చిన స్పీచ్ ను రివైండ్ చేసుకుని చూసుకుంటే అన్నయ్య కంటే ఆయన చేస్తున్న తప్పేంటో తెలుస్తుంది. కమ్మల మనస్తత్వమున్న కాపుల కన్నా స్వచ్చమైన కమ్మల మనసున్న కాపులు బహు మేలు.. విశ్వదాభిరామ వినురవేమ' అంటూ చేసిన ట్వీట్ కైతే ఒక రేంజ్ లో వ్యతిరేకత వచ్చింది.

చెప్పలేని మాటలతో:

చెప్పలేని మాటలతో:

ఇక మత విశ్వాసాల విషయం లో అయితే వర్మ వేసే పంచ్ లకి చంపేస్తాం అంటూ కూడా బెదిరింపులు వచ్చాయి. చెప్పలేని మాటలతో తిట్టిన వారున్నారు కానీ దేనికీ చలిమంచలేదు వర్మ.

సవాల్ విసిరాడు:

సవాల్ విసిరాడు:

ఇక వంగవీటి రంగా సినిమా సమయం లో వచ్చిన బెదిరిపులకైతే ఒక రేంజి లో రిప్లై ఇచ్చాడుతను బెజవాడ వచ్చే ఫ్లైట్ డీటైల్స్ - టైం - ఉండబోయే హోటల్ తో సహా.. వివరాలన్నిటినీ నెట్ లో పెట్టి తనను బెదిరిస్తున్న వాళ్లకి సవాల్ విసిరాడు వర్మ.

నేను పెద్ద రౌడీ ని :

నేను పెద్ద రౌడీ ని :

'నాకు వార్నింగ్ ఇస్తున్న ఇవాల్టి విజయవాడ రౌడీలు తెలుసుకోవాల్సింది.. నేను ఆనాటి రౌడీలతో తిరిగిన అసలు సిసలైన నిజమైన రౌడీని' అని కూడా రాసేశాడీ డైరెక్టర్. తనకు వార్నింగ్ ఇస్తూ రౌడీలు అనుకుంటున్న ఆకు రౌడీలందరూ బావిలో కప్పలని..

మీకు దమ్ముంటే:

మీకు దమ్ముంటే:

విజయవాడని ఆ రౌడీలం అనుకుంటున్న రౌడీల కంటే ఎక్కువ గౌరవిస్తానంటూ తన ఉద్దేశ్యం తేల్చి చెప్పేశాడు వర్మ. 'విజయవాడ రావద్దని వార్నింగ్ ఇస్తున్న వాళ్లకి నా కౌంటర్ వార్నింగ్. నేనెప్పుడొస్తానో ఎక్కడుంటానో చెప్తా.. మీకు దమ్ముంటే ముంబైలో అడుగు పెట్టండి' అంటూ ప్రతి సవాల్ కూడా విసిరాడు.

బాబూ అఖిల్:

బాబూ అఖిల్:

అయితే అంతటి వర్మ కూడా నిన్న అఖిల్ మీద పెట్టిన ఒక ట్వీట్ ని తీసేసాడు.ఇంతకీ వర్మ చేసిన ట్వీట్ ఏమిటంటే... ''బాబూ అఖిల్.. అసలు కెరియర్ అనేదే మొదలవ్వకముందే..పెళ్ళీ అనే ఊబిలోకి దిగాలనుకుంటున్నావ్?? నేను చేసినట్టే నువ్వూ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయవనే అనుకుంటున్నా'' అంటూ ట్వీటేశాడు.

వర్మ స్టయిల్లో:

వర్మ స్టయిల్లో:

అయితే వర్మ వాడిన భాష ఇలా లేదు ఇంగ్లీష్ లో వర్మ చేసిన ట్వీట్ చూస్తే ఎవరికైనా కాస్త ఇబ్బందిగా అనిపించక మానదు. వర్మ స్టయిల్లో.. ''Akhil Evn b4 a career off can't understand why fuck u wanna land in marriage fuck but since i'm fuck i hope for her u not fucked up' అంటూ రాశాడు.

ట్వీట్ డిలీట్ చేసేశాడు:

ట్వీట్ డిలీట్ చేసేశాడు:

ఇక మనోళ్ళు ఈ ట్వీట్లను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అలాగే అవతల అఖిల్ చేసుకోబోయేది కూడా చాలా పెద్దింటి అమ్మాయిని. అందుకే అన్ని యాంగిల్స్ నుండి మనోడిపై బీభత్సమైన ప్రెజర్ పెరిగిపోవడంతో.. వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసేశాడు.

వ్వరికైనా మండుతుంది:

వ్వరికైనా మండుతుంది:

కొన్ని విషయాలలొ మరీ ముందుకు పోవటం ఎంతపొరపాటో వర్మకి అర్థమై ఉండాలి. పర్స్నల్ జీవితాల మీద వ్యక్తిగతంగా చెప్పటం బావుంటుందేమో. వర్మ నాగార్జున ఫ్యామిలికి క్లోజే కావొచ్చు, అఖిల్ ని చిన్నప్పటినుంచే చూస్తూ ఉండొచ్చు కానీ అంత మాత్రాన మరీ ఇంత వెటకారంగా పబ్లిక్ పోస్ట్ పెడితే ఎవ్వరికైనా మండుతుంది కదా... ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు వర్మ..

అఖిల్ పెళ్ళి:

అఖిల్ పెళ్ళి:

చైతూ సమంతల పెళ్ళికన్నా ముందుగానే అఖిల్ పెళ్ళి జరుగుతుంది అన్న సంకేతాలు ఇప్పటికే చైతన్య లీకులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ లీకులకు మరింత బలం చేకూర్చే విధంగా అఖిల్ పెళ్ళి ఏర్పాట్లకు సంబంధించి అప్పుడే అక్కినేని కాంపౌండ్ లో కొన్ని ప్రాధమిక చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సమ్మర్‌లో మ్యారేజ్‌:

సమ్మర్‌లో మ్యారేజ్‌:

వీళ్ల లవ్‌కి పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో మిగతా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి ఇరు కుటుంబాలు. వచ్చేఏడాది సమ్మర్‌లో మ్యారేజ్‌కి ప్లాన్ చేస్తున్నాయి. ఐతే, వివాహం ఇక్కడ? అనేది ప్రస్తుతానికి కన్య్ఫూజన్.

డెస్టినేషన్ వెడ్డింగ్‌:

డెస్టినేషన్ వెడ్డింగ్‌:

నార్మల్‌గా ఇక్కడ చేస్తే బాగుంటుందని నాగ్ ఫ్యామిలీ భావిస్తుంటే.. ఘనంగా చేయాలన్నది భూపాల్ ఫ్యామిలీ ఆలోచన. అమ్మాయి కుటుంబం మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్‌కే ప్రిపేర్ అయినట్టు సమాచారం. కుర్రాళ్ల ఆలోచనకు ఈ పద్దతి బాగుంటుందని అంటున్నారట.

ఇటలీ రాజధాని రోమ్:

ఇటలీ రాజధాని రోమ్:

యూరప్‌లోని ఇటలీ రాజధాని రోమ్ అయితే బాగుంటుందని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇరు కుటుంబాలు చర్చల్లో నిమగ్నమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ రోమ్‌లో మ్యారేజ్ వుంటే ఇక్కడ నుంచి దాదాపు 600 మంది గెస్టులు హాజరవుతారనే అంచనా వేస్తున్నారట. మొత్తానికి వెడ్డింగ్ ఎక్కడా అనేది వచ్చేవారంలో కొలిక్కిరానుందని ఇన్‌సైడ్ సమాచారం.

English summary
Varma Tweeted on Akhil Akkineni's Marriage lost nite in a unparliamentary language and Deleted
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu