»   » సీన్ పండించాలని తాగితే.... చివరికలా రచ్చ రచ్చ అయ్యింది

సీన్ పండించాలని తాగితే.... చివరికలా రచ్చ రచ్చ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీన్లు బాగా రావాలని నటులు కొన్ని సార్లు వింత నిర్ణయాలు తీసుకుంటారు. మొన్నటివరకూ ఈ పద్దతి ఎక్కువగా హాలీవుడ్ లో కనిపించేది. బాలీవుడ్ లో అడపాదదపా కనిపించటం ఉన్నా తక్కువ. ఒక సీన్లో సహజత్వం రావటానికి హీరోలు కావాల్నే తిండి మానేయటం, గంటల తరబడి ఎండల్లో నిలబడి కావాలనే నీరసపడిపోవటం నుంచీ.... లావు పెరగాలనుకున్నప్పుడు విపరీతంగా తిని వర్కౌట్లు చేయతం కూడా కనిపిస్తూనే ఉంది. అయితే ఇదే తరహాలో మొన్నటికి మొన్న "సాలా ఖడూస్" కోసం రోడ్డు పక్క ఉన్న దాబాలో ఒకేసారి ఆపకుండా ఆరుపెగ్ ల వొడ్కా తాగి ఆనక అక్కడ గందర గోళం సృష్టించిన సంగతి తెలిసిందే కదా.... ఇప్పుడు వరుణ్ ధావణ్ కూడా అదే పని చేయబోయాడట.. సీన్ బాగానే వచ్చినా మనోడికి ఎక్కువ అలవాటు లేక పోవటం తో పాపం ఆ విస్కీ ఎఫ్ఫెక్ట్ కి షూటింగ్ అయ్యాక ఆఫ్ స్క్రీన్ పెర్ఫార్మెన్స్ కూడా ఇరగదీసాడట.

Varun Dhawan

యువతకు ఆదర్శంగా ఉండాలన్న లక్ష్యంతో బాలీవుడ్‌ యువహీరో వరుణ్‌ ధావన్‌ సిగరెట్లు, మద్యానికి ఇప్పటివరకూ దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పుడు ఆ వ్రతానికి చెక్‌ పెట్టినట్టే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ''బద్రినాథ్‌ కి దుల్హనియా''లో ఓ ఎమోషనల్‌ సీన్‌ కోసం వరుణ్‌ విస్కీ పట్టించాడు. అదీ ఒకటీ రెండు పెగ్గులు కాదు కాస్త ఎక్కువే ఏకధాటిగా "రా" కొట్టతం తో తర్వాత మాత్రం రచ్చ రచ్చ చేసాడట.

సదరు సన్నివేశం పండాలన్న ఉద్దేశంతోనే హార్డ్‌ డ్రింక్స్‌ కు దూరంగా ఉన్న వరుణ్‌ విస్కీ తాగాలని నిర్ణయించుకున్నాడు. ఇక విస్కీ లాగించిన తర్వాత వరుణ్‌ మంచి నాచురల్‌ పెర్ఫార్మన్శ్ ఇచ్చాడని చిత్రబృందం అంటోంది.కానీ సన్ని వేశం అయిపోయాక ఆల్కహాల్‌ ఎఫెక్ట్‌ తో ఈ సీన్‌ షూట్‌ పూర్తైన తర్వాత వరుణ్‌ మిగిలిన సన్నివేశాలు చేయలేకపోయాడు. అక్కడితో బాగానే ఉందికానీ ఆ మత్తులో సెట్స్ మీద పిచ్చ వీరంగం వేసాడట దురుసుగా ఏం కాదు గానీ వరుణ్ చేసిన పనులకి అంతా బాగానే నవ్వుకున్నారట. దీంతో డైరక్టర్‌ శశాంక్‌ ఈ 'డిష్యూం' హీరోకు రెస్ట్‌ ఇచ్చి నెక్స్ట్‌ డే షూటింగ్‌ పోస్ట్‌ పోన్‌ చేశాడు. అదీ మరి సినిమాలో సీన్ పండించటం వరకూ ఓకేనే గానీ.... ఆ తర్వాత చేసిన సీన్ మరీ పాపులర్ అయిపోయింది.

English summary
Varun Dhawan was DRUNK while shooting an emotional scene with Alia Bhatt for Badrinath Ki Dulhania!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu