»   » నిజమే: నితిన్‌తో వరుణ్ సందేశ్ సోదరి వివాహం

నిజమే: నితిన్‌తో వరుణ్ సందేశ్ సోదరి వివాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ నెలలో టాలీవుడ్లో పెళ్లి భాజాలు వరుసగా మ్రోగుతున్నాయి. ఇటీవలే మంచు మనోజ్ వివాహం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న అల్లరి నరేష్ వివాహం జరుగబోతోంది. మరో వైపు 28న కమెడియన్ తాగుబోతు రమేష్ వివాహం కూడా జరుగబోతోంది.

తాజాగా మరో పెళ్లి వార్త వెలుగులోకి వచ్చింది. యువ నటుడు వరుణ్ సందేశ్ సోదరి వీణ సాహితి వివాహం ఫిక్సయింది. ఎన్.ఆర్.ఐ యువకుడు నితిన్‌తో ఆమె వివాహం జరుగబోతోంది. ఇటీవలే ఎంగేజ్మెంట్ సాంప్రదాయ బద్దంగా జరిగింది. త్వరలో వివాహం వివరాలు ప్రకటించనున్నారు.

Varun Sandesh’s sister engagement

ప్రియమైన సోదరి వివాహం ఫిక్స్ కావడంపై వరుణ్ సందేశ్ చాలా సంతోషంగా ఉన్నాడు. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అలా మొదలైంది' సినిమాకు వీణ సాహితి సింగర్‌గా, లిరిసిస్టుగా పని చేసింది. ఆలిండియా రేడియోలో పని చేసిన ప్రముఖ తెలుగు రచయిత జీడిగుంట రామచంద్రమూర్తికి వరుణ్ సందేశ్ మనవడు అనే విషయం అందరికీ తెలిసిందే. వరుణ్ సందేశ్ అంకుల్ జీడిగుంట శ్రీధర్ కూడా టెలివిజన్ రంగంలో పని చేస్తున్నారు.

English summary
Young hero Varun Sandesh’s sister Veena Sahithi engaged with a NRI named Nithin. The engagement took place in a traditional way.
Please Wait while comments are loading...