మరో సినిమాకు కమిటైన వరణ్ సందేష్

By Bojja Kumar

హైదరాబాద్ : వరుణ్ సందేష్ హీరోగా మరో చిత్రం ప్రారంభం కానుంది. శ్రీసెవెన్ మూవీ మేకర్స్ పతాకంపై కట్టా మల్లి సమర్పణలో విజయశ్రీనివాస్ గుండపునేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాశీ బత్తుల ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఈచిత్రం కోసం ఇతర నటీనటుల ఎంపిక, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

వరుణ్ సందేష్ నటించిన 'సరదాగా అమ్మాయితో' చిత్రం ఈ రోజు విడుదలైంది. ప్రస్తుతం వరుణ్‌సందేశ్, నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా భానుశంకర్ దర్శకత్వంలో శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై పత్తికొండ కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే బాక్సాఫీసు వద్ద ఈచిత్రానికి రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది.

ఈ మధ్య కాలంలో వరుణ్ సందేష్‌కి ఒక్కహిట్టూ లేక పోయినా....చేతిలో సినిమాలు మాత్రం బాగానే ఉన్నాయి. ప్రస్తుతం అతని చేతిలో ట్విస్ట్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, డి ఫర్ దోపిడి, ఉదయం, నువ్వలా నేనిలా, ఈ వర్షం సాక్షిగాతో పాటు టైటిల్ ఖరారు కాని మరో సినిమా కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X