»   » వరుణ్ సందేశ్-వితిక పెళ్లి డేట్ ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ ఇదే (ఫోటో)

వరుణ్ సందేశ్-వితిక పెళ్లి డేట్ ఫిక్స్... వెడ్డింగ్ కార్డ్ ఇదే (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హీరో వరణ్ సందేశ్, హీరోయిన్ వితికా షేరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో వీరి ఎంగేజ్మెంట్ హైరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.

తాజాగా వరుణ్-వితిక వివాహ తేదీ ఫిక్స్ అయింది. ఆగస్టు 18వ తేదీ గురువారం రాత్రి 3.14 గంటలకు (శుక్రవారం తెల్లవారుఝాము) వీరి వివాహం జరుగబోతోంది. హైదరాబాద్ శివారులోని తూముకుంట విలేజ్ సమీపంలో ఉన్న అలంకృత రిసార్టులో ఈ వేడుక జరుగబోతోంది.

ప్రస్తుతం వరుణ్, వితిక వెడ్డింగ్స్ ఇన్విటేషన్స్ తదితర కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. 'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జోడీగా నటించిన వితికా షేరుతో వరుణ్ సందేశ్ కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొంత కాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారం విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీ డేస్' చిత్రం భారీ విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'కొత్త బంగారు లోకం' కూడా హిట్ కావడంతో వరుణ్ కి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బొల్తా పడటంతో కెరీర్ కాస్త స్లో అయింది. పెళ్లి తర్వాత తనకు కెరీర్ పరంగా కలిస్తుందని వరుణ్ సందేశ్‌ భావిస్తున్నారట.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

వెడ్డింగ్ కార్డ్

వెడ్డింగ్ కార్డ్

వరుణ్ సందేశ్, వితిక షేరు వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఇదే..

వరుణ్-వితిక

వరుణ్-వితిక

వరుణ్ సందేశ్, వితిక షేరు ఎంగేజ్మెంట్ నాటి దృశ్యం.

ప్రస్తుతం సినిమాలు లేవు

ప్రస్తుతం సినిమాలు లేవు

వరుణ్ సందేశ్-వితిక షేరు ఎంగేజ్మెంట్ తర్వాత సినిమాలేమీ కమిట్ కాలేదు. పెళ్లి తర్వాత హనీమూన్ పూర్తయ్యాకే మళ్లీ సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం ఉంది.

వితిక దూరమే..

వితిక దూరమే..

హీరోయిన్ వితికా షేరు పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా? అంటే దాదాపుగా నటించక పోవచ్చని అంటున్నారు సన్నిహితులు.

ప్రేమ పక్షులు

ప్రేమ పక్షులు

గత కొంత కాలంగా వరుణ్ సందేశ్, వితిక షేరు ప్రేమించుకుంటున్నారు.

పడ్డానండీ ప్రేమలో మరి

పడ్డానండీ ప్రేమలో మరి

‘పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జోడీగా నటించిన వితికా షేరుతో వరుణ్ సందేశ్ కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

వివాహం

వివాహం

ఆగస్టు 18న వరుణ్, వితిక షేరు వివాహం ద్వారా ఏకం కాబోతున్నారు.

English summary
The wedding muhurtham for Varun Sandesh and Pranathi Vithika has been fixed. They are going to get married on 18th August in Hyderabad. The actor and actress fell in love during the shoot of ‘Paddanandi Premalo Mari’. As both sides of the parents agreed to their marriage, they got engaged to each other last year. Varun Sandesh has started inviting the celebrities in the movie industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu