twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెదనాన్న లాంటి వ్యక్తి.. బాగా గౌరవించా, నేను చేసిన తప్పు అదే.. వరుణ్ తేజ్!

    |

    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. వరుణ్ నటించే ప్రతి చిత్రంపై ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారు. గత వారం వరుణ్ తేజ్ నటించిన స్పేస్ థ్రిల్లర్ మూవీ అంతరిక్షం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతరిక్షం గురించి తన తదుపరి చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు. హ్యాట్రిక్ విజయాలు, డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించాలని తాను భావించనని ఎప్పటిలాగే అంతరిక్షంతో ఓ మంచి ప్రయత్నం చేశాం అని తెలిపాడు.

    భయం లేదు

    భయం లేదు

    కమర్షియల్ అంశాలకు దూరంగా అంతరిక్షం చిత్రం చేస్తున్నాననే భయం తనలో ఎప్పుడూ లేదని వరుణ్ తెలిపాడు. కాని మంచి కథతో వస్తున్నాం అనే నమ్మకం తో ఈ చిత్రాన్ని చేశాం. ఈ చిత్రంలో హీరో పాత్ర దేశం కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకునే విధంగా ఉంటుంది. అదే ఈ చిత్రంలో ఉండే కమర్షియల్ పాయింట్ అని వరుణ్ తేజ్ తెలిపాడు.

    సీనియర్ దర్శకులతో

    సీనియర్ దర్శకులతో

    గతంలో పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల లాంటి సీనియర్ దర్శకులతో పనిచేసినా విజయాలు రాలేదు అనే విషయంపై వరుణ్ స్పందించాడు. వాళ్ళు సీనియర్ దర్శకులు అయినప్పటికీ కథపై నమ్మకంతోనే అ చిత్రాలు చేశానని వరుణ్ తెలిపాడు. కాని ఆ చిత్రాలు నిరాశ పరిచాయి. ఒక చిత్రం పరాజయం చెందిందంటే అనేక కారణాలు ఉంటాయి. వ్యక్తిగతంగా నేను ఎక్కడ తప్పు చేశాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. కథల ఎంపికలో తప్పు చేస్తున్నానని తేలింది.

     వాళ్లని గౌరవించా

    వాళ్లని గౌరవించా

    పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల లాంటి దర్శకులు దశాబ్దాల నుంచి ఇండస్ట్రి లో ఉంటున్నారు. వాళ్ళ సీనియారిటీని గౌరవించి ఏవైనా పొరపాట్లు జరిగినా సైలెంట్ గా ఉండిపోయా అని వరుణ్ తెలిపాడు. కాని తొలిప్రేమ చిత్రం చేసే సమయానికి నాకు కుడా ఎంతోకొంత అనుభవం ఉంది. ఆ సమయంలో నాకు ఏమైనా అనుమానాలు ఉంటె దర్శకుడు వెంకిని అడిగేవాడిని. వెంకి ఆ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అలా అని ప్రతి సందర్భంలో కల్పించుకుని దర్శకులని తను ఇబ్బంది పెట్టనని వరుణ్ తెలిపాడు.

     పెదనాన్న లాంటి వ్యక్తి

    పెదనాన్న లాంటి వ్యక్తి

    ఎఫ్2 సినిమా గురించి మాట్లాడుతూ.. అది మాస్ మసాలా చిత్రం అని వరుణ్ తెలిపాడు. వెంకటేష్ గారితో పనిచేయడం మరచిపోలేని అనుభూతి. ఆయన పెదనాన్న చిరంజీవి గారి స్థాయి ఉన్న వ్యక్తి. చిరంజీవి గారి లాంటి వ్యక్తి మనకు ఫ్రెండ్ అయితే ఇలా ఉంటుందో వెంకటేష్ గారితో అలా ఉంటుంది అని వరుణ్ తెలిపాడు. రాత్రి ఫ్రెండ్స్ తో కలసి ఈ పని చేశాం.. ఆ పనిచేశాం అని పెదనాన్నతో చెప్పుకోలేము. కాని వెంకటేష్ గారితో చెప్పుకోవచ్చు. ఆయన అంత సరదాగా ఉంటారని ఊహించలేదు. కళ్యాణ్ బాబాయ్ కి కుడా ఆయన చాలా క్లోజ్ అని వరుణ్ తెలిపాడు.

    వాళ్ళిద్దరి మధ్యలో అంటే

    వాళ్ళిద్దరి మధ్యలో అంటే

    ఎఫ్2 చిత్రంలో నేను ఎక్కువగా వెంకి, రాజేంద్ర ప్రసాద్ మధ్యలో నటించాలి. వాళ్ళిద్దరూ కామెడీలో అరితెరిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో అంటే నాకు భయం వేసింది అని వరుణ్ తెలిపాడు. తదుపరి కొత్త దర్శకుడితో స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నానని వరుణ్ తెలిపాడు. హరీష్ శంకర్ కుడా ఓ కథతో వచ్చాడు. ఎఫ్2 చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

    English summary
    Varun Tej About his failures with senior directors. Reveals interesting facts about Venkatesh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X