»   » ఏ ఇమేజీ వద్దంట! వరుణ్ తేజ్ మనో వేదన అదేనా?

ఏ ఇమేజీ వద్దంట! వరుణ్ తేజ్ మనో వేదన అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలంతా తమకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్ ఉండాలంటూ భావిస్తారు. మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వరుణ్ తేజ్ మాత్రం తనకు అలాంటివేమీ వద్దంటున్నాడు. అన్ని రకాల సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాను, అందుకే ఒకదానికొకటి సంబంధం లేని సినిమాలు చేస్తున్నాను అన్నారు.

సినిమా రంగంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరూ స్టార్ హీరో అవ్వాలని కలలుకంటారు. అయితే వరుణ్ తేజ్ మాత్రం స్టార్‌ హీరో అనిపించుకోవాలని నాకేమీ లేదండీ అంటూ కూల్ గా చెప్పేస్తున్నాడు. నిజాయితీగా చెప్పాలంటే ఓ నటుడిగా ఉండాలనుకుంటున్నాను అంటూ మీడియా ముందు డైలాగులు దంచేసాడు.

నేను మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించడం లేదు. మాస్‌ కేరక్టర్‌ కూడా వరుణ్‌ బాగా చేశాడనిపించుకుంటే చాలు. మా ఫ్యామిలీలో అందరూ మంచి నటులే. అందుకే ఇంత పెద్ద ఇండస్ట్రీలో అందరూ మనగలుగుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇంతకాలానికి ఓ స్టార్‌ కాకుండా యాక్టర్‌ వచ్చాడని విజయవాడలో ఒకరు అంటే యాక్టర్‌ కాకుండా స్టార్‌ అవడని చెప్పాను.

Varun Tej about Loafer

‘కంచె' సినిమా రిలీజ్ తర్వాత వరుణ్ తేజ్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. వరున్ తేజ్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ని మించి పోతాడు అనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో బాబాయ్ పవన్, అన్నయ్య చరణ్ కి తాను ఏమాత్రం పోటీ కాను, అలాంటి ఉద్దేశ్యం తనకు అనే మెసేజ్ పంపడానికే వరుణ్ తేజ్ ఇలా మాట్లాడాడని స్పష్టమవుతోంది. అలాగే వరుణ్ బాబూ.... ప్రేక్షకులు మీ మనో వేదనను మాటలను 100% నమ్మారని ఆశిస్తున్నాం.

లోఫర్ సినిమా గురించి మాట్లాడుతూ....పూరి గారు ఈ టైటిల్ చెప్పగానే షాకయ్యాను. మ్మ సెంటిమెంట్‌ ఈ సినిమా కథకు ఆత్మ అని చెప్పాలి. నేను ఈ స్ర్కిప్టు ఒప్పుకోడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. దానికి సంబంధించిన సన్నివేశాలు వింటున్నప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చారు. తల్లీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలకు బాగా కనెక్టయ్యాను. రేవతిగారు ఆ పాత్ర చెయ్యడం, ఆమె కొడుకుగా నేను నటించడం ఆనందంగా ఉంది అన్నారు. అమ్మ సెంటిమెంట్‌పై సుద్దాల అశోక్‌తేజ్‌గారు రాసిన ‘సువ్వీ సువ్వాలమ్మా' పాటను చిత్రీకరించేప్పుడు అందులోని ఎమోషన్‌ను తట్టుకోలేక మొదటిరోజు ఆ పాటను చెయ్యలేకపోయా. పూరిగారు కూడా ఆ రోజు షూటింగ్‌ కేన్సిల్‌ చేశారు. అన్నారు. సినిమాలో తండ్రి కొడుకులం కలిసి దొంగతనాలు చేస్తూ మందు కొడుతుంటాం. నాకూ పోసానిగారి మధ్య వచ్చే సీన్లు బావుంటాయి అన్నారు.

English summary
“The character I play in Loafer and even the movie itself is quite different from my previous two films Mukunda and Kanche. I want to make sure that I don’t repeat myself. It would be my aim to do something different in each film.” Says Varun.
Please Wait while comments are loading...