»   » మెగా ఫ్యాన్స్ తలెత్తుకునేలా చేస్తా, పవన్ ఫ్యాన్ అంటే నచ్చలేదు: వరుణ్ తేజ్

మెగా ఫ్యాన్స్ తలెత్తుకునేలా చేస్తా, పవన్ ఫ్యాన్ అంటే నచ్చలేదు: వరుణ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వ‌రుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం 'ఫిదా'. ఈ చిత్రానికి శ‌క్తికాంత్ సంగీతం అందించారు. ఆడియో రిలీజ్ వేడుక సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ వేడుకకు అతిథులెవరినీ పిలవలేదు. ఆడియో సీడీల‌ను నిర్మాత దిల్‌రాజు విడుద‌ల చేయ‌గా, తొలి సీడీని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా వరుణ్ తేజ్ ఎమోషనల్ స్పీచ్ ఆకట్టుకుంది. సినిమాకు సంబంధించి వివరాలతో పాటు మెగా ఫ్యామిలీ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు.


మెగా అభిమానులు తలెత్తుకునేలా చేస్తాను

మెగా అభిమానులు తలెత్తుకునేలా చేస్తాను

వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ‘మామూలుగా మా ఆడియో ఫంక్షన్లు అంటే డాడీ, బాబాయ్, చరణ్, బన్నీ ఇలా ఎవరో ఒకరు వస్తారు. ఈ ఫంక్షన్ వరకు మాత్రం మా క్రూతో మాత్రమే చేయాలని అనుకున్నాం. వాళ్లెవరూ రాకున్నా అభిమానులంతా వచ్చి పెద్ద సపోర్టు ఇస్తున్నందుకు థాంక్స్. మా పెద్దనాన్న గారి అభిమానుల నుండి, బాబాయ్ అభిమానుల నుండి చాలా ఫీడ్ బ్యాక్ వస్తుంటుంది. రెండు మూడు చోట్ల తప్పటడుగులు వేశాను. ఇప్పటి నుండి మంచి సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మీరంతా తలెత్తుకునేలా చేస్తాను అని వరుణ్ తేజ్ అన్నారు.


కేవలం చిరంజీవి మాత్రమే

కేవలం చిరంజీవి మాత్రమే

నేను ఇక్కడ ఈ రోజు నిలబడటానికి కారణం ఇన్స్‌స్పిరేషన్ కలింగింది ఒకే వ్యక్తి వల్ల... అది మా మెగాస్టార్ చిరంజీవి వల్లే, కళ్యాణ్ బాబాయ్ సినిమాల్లోకి రాక ముందు నుండే నాకు పెద్దనాన్న. ఆయనే ఫస్ట్ ఇన్స్‌స్పిరేషన్, ఆ తర్వాత కళ్యాణ్ బాబాయ్ అని వరుణ్ తేజ్ తెలిపారు.


పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనగానే నచ్చలేదు

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనగానే నచ్చలేదు

శేఖర్ కమ్ములగారు స్టోరీ చెప్పిన తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు. సార్ నాకు నచ్చలేదు అని వెంటనే చెప్పాను. ఎందుకంటే నేను కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ ఈ సినిమాలో ఆమె చెబితేనే బావుంటుందని రియలైజ్ అయ్యాను. ఈ సినిమాలో బాబాయ్ డైలాగులు రెండు మూడు చోట్ల ఉంటాయి, మీ అందరికీ నచ్చుతాయి.... అని వరుణ్ తేజ్ తెలిపారు.


సినిమా బాగా నచ్చుతుంది

సినిమా బాగా నచ్చుతుంది

మా ‘ఫిదా' సినిమాలో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీతో, గర్ల్ ఫ్రెండుతో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఫోటోగ్రఫీ, మ్యూజిక్ ఇలా అన్నీ బావుంటాయి. ఈ సినిమా మీ అందరి ముందుకు జులై 21న వస్తోంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.... అని వరుణ్ తేజ్ తెలిపారు.


జై హింద్ అంటూ పవన్ కళ్యాణ్ స్టైల్‌లో

జై హింద్ అంటూ పవన్ కళ్యాణ్ స్టైల్‌లో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా చివరకు జై హింద్ అంటూ ముగిస్తారు. ఇపుడు వరుణ్ తేజ్ కూడా బాబాయ్ స్టైల్ లో జై హింద్ అని చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి వరుణ్ తేజ్ కొన్ని విషయాల్లో బాబాయ్‌ని ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది.English summary
Varun Tej Emotional Speech at Fidaa Movie Audio Launch. Fidaa Movie Audio Launch Function held at Hyderabad. Varun Tej, Sai Pallavi, Shekhar Kammula, Dil Raju, Shakthi Kanth graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu