twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ తేజ్, హరీష్ శంకర్ 'వాల్మీకి' చిత్రంపై వివాదం.. రచ్చ చేస్తోంది ఇందుకే!

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్2 చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. వరుణ్ తేజ్ ప్రతి చిత్రంలో తనదైన శైలిలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఇటీవల వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభమైంది. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన హరీష్ శంకర్ దర్శత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి 'వాల్మీకి' అనే టైటిల్ ప్రకటిస్తూ టైటిల్ లోగో విడుదల చేశారు. ఈ చిత్ర టైటిల్ కు సంబంధించి తాజాగా వివాదం మొదలైంది.

     నిహారిక చేతుల మీదుగా

    నిహారిక చేతుల మీదుగా

    ఇటీవల వాల్మీకి చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. వరుణ్ తేజ్ సోదరి నిహారిక ఈ చిత్రానికి తొలి క్లాప్ అందించారు. దిల్ రాజ, ఇతర ప్రముఖులు ఈ వేడుకకు అతిధులుగా హాజరయ్యారు. వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర విభిన్నంగా నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కంచె, అంతరిక్షం లాంటి విభిన్న చిత్రాలు చేస్తూనే వరుణ్ తేజ్ ఫిదా, తొలి ప్రేమ లాంటి రొమాంటిక్ చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. తాజాగా వాల్మీకి చిత్రంలో ఎలా కనిపిస్తాడనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

    వివాదం మొదలు

    వివాదం మొదలు

    వాల్మీకి టైటిల్ పై తాజాగా వివాదం మొదలైంది. వాల్మీకి సామజిక వర్గ సంఘం నాయకుడు సాయి ప్రసాద్ చిత్ర యూనిట్ కి హెచ్చరిక జారీ చేశారు. వాల్మీకి టైటిల్ వాల్మీకి మహర్షిని కించపరిచేలా, తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని అంటున్నారు. టైటిల్ మార్చకుంటే చిత్ర షూటింగ్ ని అడ్డుకుంటాం అని హెచ్చరించారు. వాల్మీకి చరిత్ర తెలియకుండా ఈ టైటిల్ రూపొందించినట్లు ఉన్నారని ఆయన అన్నారు.

    కారణం ఇదే

    కారణం ఇదే

    వాల్మీకి చిత్ర టైటిల్ పై తుపాకీ ఉంది. దీనిపైనే వాల్మీకి సంఘం అభ్యంతరం తెలుపుతోంది. తుపాకీ వలన తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు. వాల్మీకి మహర్షిపై భక్తిరస, ఆధ్యాత్మిక చిత్రాలు రూపొందిస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారు. కానీ ఎలా వినోదాత్మక చిత్రాలు చేస్తూ ఆయన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని అన్నారు. రామాయణం మహాకావ్యం ద్వారా కుటుంబ విలువలని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు వాల్మీకి అని సాయి ప్రసాద్ అన్నారు.

    ఫ్యాక్షనిజం వదిలేశాం

    ఫ్యాక్షనిజం వదిలేశాం

    వాల్మీకి సంఘం ప్రజలంతా ఫ్యాక్షన్ ని వదిలేసి చాలా కాలం అవుతోందని అన్నారు. టైటిల్ లో తుపాకీ చేర్చడం వలన వాల్మీకి సంఘాన్ని నేరస్థులుగా, తుపాకులు పట్టుకుని హింసని ప్రోత్సహించే వారీగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. చిత్ర యూనిట్ వెంటనే వాల్మీకి టైటిల్ మార్చాలని డిమాండ్ చేశారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. జిగర్తాండ అనే తమిళ చిత్రాన్ని హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

    English summary
    Varun Tej and Harish Shankar Valmiki movie title became controversy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X