»   » 'మిస్టర్ ' సెట్స్ పై గాయపడ్డ వరుణ్ తేజ,హాస్పటిల్ లో

'మిస్టర్ ' సెట్స్ పై గాయపడ్డ వరుణ్ తేజ,హాస్పటిల్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు ..వరుణ్ తేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా చేస్తున్న ఓ స్టంట్ సీన్ లో ఆయన గాయపడ్డారు. ఈ షూటింగ్ ప్రస్తుంత ఊటిలో జరుగుతోంది. వెంటనే వరుణ్ తేజని హాస్పటిల్ కు తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి, ట్రీట్మెంట్ ఇచ్చారు. పెద్దగా కంగారు పడాల్సింది లేదని, మూడు వారాలు రెస్ట్ తీసుకుని, మందుకు తీసుకుంటే సరిపోతుందని అంన్నారు. దాంతో షూటింగ్ ని ఆపుచేసారు.

ఆగడు', 'బ్రూస్ లీ' లాంటి రెండు భారీ పరాజయాల తర్వాత మళ్ళీ ఓ బలమైన హిట్ కొట్టాలన్న కసితో దర్శకుడు శ్రీనువైట్ల వరుణ్‌కు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. దూకుడు బాద్షా, ఆగడు..ఇలా హై యాక్షన్ పోలీస్ ఎంటర్ ట్రైనర్ లు అందించాడు వైట్ల.

Varun Tej injured on Mister sets

అలాగే వరుణ్ తేజ్ తో తీసుకున్న'మిస్టర్' కూడా పోలీసు కథేనన్న లీకు బయటికివచ్చింది. ఇదీ ఓ కాప్ స్టోరీనేనట. అయితే హీరో పాత్ర రెండు రకాలుగా సాగుతుందట. ఈ క్యారెక్టరైజేషనే సినిమాకి హైలెట్ కానుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది.

లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై 'ఠాగూర్‌' మధు, నల్లమలుపు శ్రీనివాస్‌ నిర్మించనున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గోపీమోహన, మాటలు: శ్రీధర్‌ సీపాన, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, ఛాయాగ్రహణం: జె. యువరాజ్‌, సమర్పణ: బేబీ భవ్య.

English summary
Varun Tej who was shooting for Sreenu Vaitla’s film ‘Mister’ has been injured while performing a stunt scene. The shooting was happening in Ooty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu