సీక్రెట్ ఏజెంటుగా కనిపించబోతున్న వరుణ్ తేజ్
హైదరాబాద్: ‘కంచె' చిత్రంతో మంచి విజయాన్ని అందున్నారు హీరో వరుణ్ తేజ, దర్శకుడు క్రిష్. ఇద్దరు మరోసారి కలిసి పని చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సీక్రెట్ ఏజెంటుగా కనిపించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమలో వరుణ్ తేజ్ లుక్ కూడా గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఓ సీక్రెట్ మిషన్ కోసం వరుణ్ తేజ్ ఏజెంటుగా పని చేస్తాడని అంటున్నారు. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టెనర్ గా తెరకెక్కించేందుకు దర్శకుడు క్రిష్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అఖిల్ అక్కినేని నటిస్తాడని ప్రచారం జరిగినా... చివరకు వరుణ్ తేజ్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈ సినిమాను నిర్మించబోతున్నారట.
వరుణ్ తేజ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్' మూవీ చేస్తున్నాడు. ఈ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సీకే ఎంటర్‌టైమెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











