పవన్ కోసం వెనక్కి తగ్గిన 'గని'.. మేము కూడా భీమ్లా నాయక్ కోసం వెయిటింగ్ అంటూ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే భీమ్లా నాయక్ దెబ్బకు ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే...

బాక్సింగ్ నేపథ్యంలో

బాక్సింగ్ నేపథ్యంలో

మెగా హీరో వరుణ్ తేజ్ గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాక్సర్ పాత్రను పోషిస్తున్న వరుణ్ ప్రో అథ్లెట్ లాగా కనిపిస్తున్నాడు. ఇక అలా కనిపించడానికి తీవ్రంగా శిక్షణ పొందారు.

టాలీవుడ్‌లో డెబ్యూ

టాలీవుడ్‌లో డెబ్యూ

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ 'గని' సినిమాతో సాయి మంజ్రేకర్ టాలీవుడ్‌లో డెబ్యూ ఇస్తోంది. జగపతి బాబు, నవీన్ చంద్ర, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా లాంటి వారు నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని అల్లు బాబి ఒక్కరే నిర్మించడం లేదు. ఆయన తన స్నేహితుడు సిద్ధూతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇప్పుడిప్పుడే

ఇప్పుడిప్పుడే

కరోనా సెకండ్ వేవ్ తర్వాత కోలుకుంటోంది అనుకున్న సినీ పరిశ్రమ థర్డ్ వేవ్ దెబ్బకు మళ్ళీ సైలెంట్ అయింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 24వ తేదీన నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ అలాగే వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. కానీ శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ రేసులో నుంచి తప్పుకుంటున్నట్లు గని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత కరోనా పరిస్థితులు ఏర్పడడంతో ఫిబ్రవరి 25న విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు.

పవన్ సినిమా కోసం

పవన్ సినిమా కోసం

నిజానికి ఫిబ్రవరి 25 వ తేదీన పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన భీమ్లా నాయక్‌ మూవీ విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద అటు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఒకేసారి విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించి గని మూవీని మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది. పవన్ సినిమా కోసం దారి ఇచ్చేస్తున్నామని పేర్కొంది.

Recommended Video

Acharya Movie : Megastar Chiranjeevi Top 10 Highest Collected Movies | Tollywood | Filmibeat Telugu

అభిమానులతో సమానంగా

మీరు 'గనీ'పై చూపిస్తున్న ప్రేమతో మేము ఉప్పొంగిపోయాము, ఈ కష్ట సమయాల్లో విశ్వాసంతో ముందుకు సాగడానికి మీ ప్రోత్సాహం మమ్మల్ని ప్రేరేపిస్తుంది, భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న సినిమాల్లోకి రాబోతున్న కారణంగా మేము #GHANI యొక్క విడుదలను వాయిదా వేస్తున్నాము. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటించబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టార్మ్‌ని పెద్ద స్క్రీన్‌లలో అనుభవించడానికి మేము అభిమానులతో సమానంగా ఉత్సుకతతో ఉన్నామని ప్రకటనలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X