»   » వరుణ్ తేజ పవన్‌లా అవుతాడు: ప్రభాస్ (లోఫర్ ఆడియో ఫోటోస్)

వరుణ్ తేజ పవన్‌లా అవుతాడు: ప్రభాస్ (లోఫర్ ఆడియో ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్' మూవీ ఆడియో వేడుక సోమవారం సాంయత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు బాహుబలి స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరైన సీడీలు విడుదల చేసారు.

సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి సంస్థపై సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశాపతాని హీరోయిన్ గా నటిస్తోంది. తొలి సీడీనీ ప్రభాస్ ఆవిష్కరించి రామ్ గోపాల్ వర్మకు అందించారు. అనంతరం ప్రభాస్ వరుణ్ తేజ్ గురించి మాట్లాడారు.


ప్రభాస్‌ రావడం వెనక చిరంజీవిపై కోపం ఉందట!


భవిష్యత్తులో వరుణ్ తేజ్ వాళ్ల బాబాయి పవన్ కళ్యాణ్ లా పెద్ద హీరో అవుతాడు అని వ్యాఖ్యానించారు. ప్రభాస్ నోటి నుండి ఈ కామెంట్ రాగానే అభిమానులంతా విజిల్స్ వేస్తూ సందడి చేసారు. పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ...ఆయనతో బుజ్జిగాడు చేయడానికి ఆరు నెలలు వెయిట్ చేసారు. హీరో క్యారెక్టరైజేషన్ మీద స్టోరీ రాయగల రైటర్ పూరిగారు మాత్రమే. ‘లోఫర్' టీంకు ఆల్ ది బెస్ట్ అన్నారు.


స్లైడ్ షోలో లోఫర్ ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోస్...


రోడ్లపై తిరిగిన పూరిలోని క్యారెక్టర్లే...

రోడ్లపై తిరిగిన పూరిలోని క్యారెక్టర్లే...


రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...స్టార్ డైరెక్టర్ కాక ముందు పూరి జగన్నాథ్ రోడ్లపై తిరిగిన సమయంలో తనలో ఉన్న క్యారెక్టర్లను ఇపుడు సినిమాల రూపంలోకి తెస్తున్నారు. లోఫర్ కూడా అలాంటి సినిమానే అంటూ చమత్కరించారు.


మదర్ సెంటిమెంట్

మదర్ సెంటిమెంట్


చాలా ఏళ్ల తర్వాత నేను తీసిన మదర్ సెంటిమెంట్ మూవీ, పోసాని, రేవతి సినిమాలో తమ పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు అని పూరి తెలిపారు.


టైటిల్ మార్చమన్నారు

టైటిల్ మార్చమన్నారు


లోఫర్ సినిమా చూసిన తర్వాత వర్మ ఆ టైటిల్ తీసేసి ‘మా అమ్మ మాలక్ష్మి' అనే టైటిల్ పెట్టమని అడిగారు. ఆయనకు సినిమా నచ్చింది. అదే రోజు నేను సక్సెస్ అయినట్లు భావించాను అన్నారు.


వరుణ్ ఏడుస్తూ అదరగొట్టాడు..

వరుణ్ ఏడుస్తూ అదరగొట్టాడు..


లోఫర్ సినిమాలో అమ్మ, కొడుకుపై వచ్చే సాంగులో వరుణ్ ఏడుస్తూ పాడే పాటలో అద్భుతంగా చేసాడు. వరుణ్ పెద్ద యాక్టర్ అవుతాడు అన్నారు పూరి.


ప్రభాస్ప్రభాస్ అభిమానిని

ప్రభాస్ప్రభాస్ అభిమానిని


ఈశ్వర్ సినిమా నుండి ప్రభాస్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. తొలుత పూరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరదామని వెళ్లాను, ఆయన రేపు రా అన్నారు. కానీ వెళ్లలేదు. ఇపుడు ఆయనతో హీరోగా చేసే అవకాశం అయినా దక్కింది. సినిమా కోసం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేసాం అన్నారు.


నటీనటులు

నటీనటులు


ఈ సినిమాలో వరుణ్ తేజ్, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, పోసానీ కృష్ణ మురళి, ముఖేష్ రుషి, సంపూర్ణేష్ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్, ఉత్తేజ్, బద్రమ్, ధన్ రాజ్, చరణ్ దీప్, శాండీ తదితరులు నటిస్తున్నారు.


తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్స్: కె.ఎస్.రాజు, గల్లా రమేష్, కిషోర్ కృష్ణ, కో డైరెక్టర్: శివరామకృష్ణ, కో రైటర్స్: కళ్యాణ్ వర్మ, కిరణ్, ఫైట్స్: విజయ్: సంగీతం: సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్: విఠల్ కోసనం, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: సికె ఎంటర్టెన్మెంట్స్, నిర్మాతలు: సివి రావు, శ్వేతలానా, వరుణ్, తేజ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


English summary
Telugu Movie Loafer Audio launch Function held at Shilpa Kala Vedika in Hyderabad on Monday evening.
Please Wait while comments are loading...