»   » 'లోఫర్‌' సెన్సార్‌ పూర్తి :డిసెంబర్‌ 17న విడుదల

'లోఫర్‌' సెన్సార్‌ పూర్తి :డిసెంబర్‌ 17న విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుప్రీమ్‌ హీరో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్‌'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 17న విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''మా లోఫర్‌ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మంచి కథ, కథనాలతో, చక్కని సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారు.


varun tej's loafer censor:Gets U/A certificate

ఇటీవల విడుదలైన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సునీల్‌ కశ్యప్‌ చేసిన అద్భుతమైన ఆడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్‌ చేసేలా వుంటుంది. డిసెంబర్‌ 17న మా 'లోఫర్‌' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం'' అన్నారు.


వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌, టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎ.కుమార్‌ వర్మ, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కె.యస్‌.రాజు, గల్లా రమేష్‌, కిషోర్‌ కృష్ణ, కో డైరెక్టర్‌: శివరామకృష్ణ, కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజయ్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Mega Prince Varun Tej’s Loafer had finished its censor formalities a short while ago. The Regional Censor Board members saw the special screening of the film and rated it U/A with no cuts.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu