»   » అదీ శ్రీను వైట్ల రేంజి: వరుణ్ తేజ్ ‘మిస్టర్’ ఫష్ట్‌లుక్ టీజర్ (వీడియో)

అదీ శ్రీను వైట్ల రేంజి: వరుణ్ తేజ్ ‘మిస్టర్’ ఫష్ట్‌లుక్ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మిస్టర్‌'. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), 'ఠాగూర్‌' మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ ఇందులో కథానాయికలు.

న్యూఇయర్ కానుకగా..... ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల ఈ మధ్య వరుస ప్లాపులతో కాస్త డౌన్ అయ్యాడు. 'మిస్టర్' సినిమాతో మళ్లీ రేంజి ఏమిటో చూపించడానికి సిద్ధమయ్యాడు.

టీజర్

వరుణ్ తేజ్ ఇందులో పిచ్చయ్య నాయుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.

ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ

ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ

‘‘నా కెరీర్‌లో ఇది స్పెషల్‌ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది. ఎందుకంటే.. ఎమోషన్స్‌కి, విజువల్స్‌కి, మ్యూజిక్‌కి స్కోప్‌ ఉన్న సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగా ఈ సినిమా కథ కుదిరింది. అదే ఈ 'మిస్టర్‌'. ఈ సినిమా కోసం చాలా చాలా ట్రావెల్‌ చేశాం. ముఖ్యంగా స్పెయిన్‌లోని అందమైన ప్రాంతాలు అర్కెంటే, బెనిడోరన్, లమంగా, సెవిల్లా, క్లాడిస్‌ బ్రిడ్జ్, వేజర్‌ వైట్‌ విలేజ్, టొలోరో, కాంబడాస్‌లలో చిత్రీకరణ జరిపాం. అలాగే స్విట్జర్లాండ్‌తో పాటు చిక్‌మంగళూరు, ఊటీ, హైదరాబాద్‌ పరిసరాల్లోని కొన్ని గ్రామాల్లో షూటింగ్‌ చేశాం. త్వరలో కేరళలో జరిపే షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తతవుతుంది. నా నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పూర్తి సహకారంతో నేను అనుకున్నది అనుకున్నట్లుగా తీయగలిగాను'' అని అన్నారు.

నిర్మాతలు

నిర్మాతలు

నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌' మధు మాట్లాడుతూ - ‘‘వరుణ్‌తేజ్‌ రేంజ్‌ పెంచే సినిమా ఇది. శ్రీను వైట్ల చాలా స్పెషల్‌ కేర్‌ తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికి 80 శాతం సినిమా పూర్తయింది. ఇంకా రెండు పాటలు, క్లైమాక్స్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 14న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు.

యాక్టర్స్, టెక్నీషియన్స్

యాక్టర్స్, టెక్నీషియన్స్

నాజర్, ప్రిన్స్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, ‘సత్యం' రాజేష్, ‘షకలక' శంకర్, నాగినీడు, హరీష్‌ ఉత్తమన్, నికితిన్‌ దీర్, షఫి, శ్రావణ్, శతృ, మాస్టర్‌ భరత్, షేకింగ్‌ శేషు, ఈశ్వరరావు, సురేఖావాణి, సత్యకృష్ణ, తేజస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్‌ సీపాన, స్టైలింగ్: రూపా వైట్ల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మిక్కి జె.మేయర్, కెమేరా: కె.వి. గుహన్, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, కో-డైరెక్టర్స్‌: బుజ్జి, కిరణ్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కొత్తపల్లి మురళీకృష్ణ, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌' మధు, సమర్పణ: బేబీ భవ్య, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Mister Telugu Movie Teaser. Mister Telugu movie ft. Varun Tej, Lavanya Tripathi and Hebah Patel. Mister Latest Telugu Movie is directed by Sreenu Vaitla and Music composed by Mickey J Meyer. Produced by Nallamalupu Bujji and Tagore Madhu, under Lakshmi Narasimha Productions banner (LNP).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu