For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొత్త కుర్రాడు కుమ్మేసాడా? (‘ముకుందా’ ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని మెగాభిమానులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. మరో మెగా నట వారసుడు, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ముకుందా' ఈ రోజు రిలీజ్ అవుతోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రంలో కుర్రాడు కొత్త అయినా కుమ్మేసాడు అంటున్నాడు. ఎక్కడా బెరుకులేకుండా తన నటనతో బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లీగ్ లో ఈ కుర్రాడు తొలి సినిమాతో చేరినట్లే అని చెప్తున్నారు.

  https://www.facebook.com/TeluguFilmibeat

  ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే కథ ఇది. ముకుంద అనే ఓ యువకుడి ప్రేమపై స్థానిక పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపించాయి? వాటి నుంచి బయట పడేందుకు అతను ఏం చేశాడు? అనే విషయాలు ఆసక్తికరం. యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. పల్లెటూరి అనుబంధాలు, ప్రేమలు, రాజకీయాలు యువతరంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయనే అంశాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఎలాంటి అంశాలకు ప్రభావితం కాని ఓ కుర్రాడి జీవితం ప్రేమ కారణంగా ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుందని ఈ చిత్రం కథ గురించి చెప్తున్నారు.

  వరుణ్ తేజ్ మాట్లాడుతూ.... ‘చదువు పూర్తి చేసుకున్న ఓ యువకుడు జీవితానికి దారి వెతుక్కునే మార్గంలో ఉండగా విలేజ్‌ పొలిటిక్స్‌ అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాయి. వాటిని అధిగమించి అతను తన గమ్యాన్ని ఏ విధంగా చేరుకున్నాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే'' అన్నారు. ఈ చిత్రంతో తో కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కాదు మాస్ ని కూడా అలరిస్తానని అంటున్నారు.

  Varun Tej's Mukunda preview

  దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... ఇదివరకు నేను తెరకెక్కించిన చిత్రాలకి భిన్నంగా యాక్షన్‌కి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నా. ప్రతీ సన్నివేశం సహజంగా కనిపించాలని భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. యువతరం భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తూ సాగే ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. వరుణ్‌తేజ్ నటన, పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.

  బ్యానర్: లియో ప్రొడక్షన్స్

  నటీనటులు: వరుణ్‌తేజ్, పూజాహెగ్డే , రావు రమేష్, రఘుబాబు, ప్రకాష్‌రాజ్, రావు రమేష్, నాజర్, రఘుబాబు, తదితరులు

  సంగీతం: మిక్కీ.జే.మేయర్,

  పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి,

  కెమెరా:మణికందన్,

  ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్,

  ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్.

  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల

  నిర్మాత: నల్లమలుపు బుజ్జి

  సమర్పణ: ఠాగూర్ మధు

  విడుదల తేదీ: 24 డిసెంబర్,2014

  English summary
  Mukunda is an action-oriented love story. The film is about romance in a rural town, and how the youth there react to local politics. This movie written & directed by Srikanth Addala. The film was produced by Tagore Madhu and Nallamalapu Srinivas (Bujji) under the banner Leo Productions. It features Varun Tej and Pooja Hegde in the lead roles, the former making his debut in Telugu cinema.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X