»   » చెన్నైకి సాయం: మెగా ఫ్యామిలీ నుండి ఫస్ట్ వరుణ్ తేజ్

చెన్నైకి సాయం: మెగా ఫ్యామిలీ నుండి ఫస్ట్ వరుణ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారీ వరదలతో చెన్నై మహానగరం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని వందలాది కాలనీలను వరదనీరు ముంచెత్తడంతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం పలువురు తెలుగు సెలబ్రిటీలు సహాయం అందిస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సంపూర్ణేష్ బాబు, నిర్మాత ప్రతాప్ కోలగల్ల తదితరులు సహాయం ప్రకటించగా...మెగా ఫ్యామిలీ నుండి మొదటి సాయం వరుణ్ తేజ్ ప్రకటించారు. చెన్నై వరద బాధితులకు సహాయం అందించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 3 లక్షల సహాయం అందించనున్నట్లు వరుణ్ తేజ్ ప్రకటించారు. త్వరలోనే ఇతర మెగా హీరోలు సైతం సహాయం అందించడానికి ముందుకు రానున్నారు.

Varun Tej To Support Chennai

మరో వైపు చెన్నై నుండి వస్తోన్న చిత్రాలను చూసి చలించిపోయిన నందమూరి సోదరులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తమ వంతు సహాయం గా తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి సహాయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ 10 లక్షల రూపాయలను, కళ్యాణ్ రామ్ 5 లక్షల రూపాయలను ప్రకటించారు. రవితేజ రూ. 5 లక్షలు ప్రకటించారు.

నా వంతుగా రూ. లక్ష అందిస్తున్నట్లు నిర్మాత ప్రతాప్ కోలగట్ల ప్రకటించారు.. అతి త్వరలో ముఖ్య మంత్రి జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని తెలిపారు. నటుడు సంపూర్ణేష్ బాబు నా వంతుగా రూ. 50 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని సంపూర్నేష్ బాబు తెలిపారు.

English summary
Varun Tej announced that he will donate 3 lakhs to the Tamil Nadu CM Relief Fund towards the relief measures for the Chennai flood victims. Varun Tej is the first person from the Mega family to donate for Chennai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu