»   » వసూల్ రాజా! షురూ చేసిన శ్రీహరి, నవదీప్

వసూల్ రాజా! షురూ చేసిన శ్రీహరి, నవదీప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీహరి, నవదీప్ ప్రధానపాత్రధారులుగా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వసూల్ రాజా'. నవదీప్ సరసన రీతూ బర్మేచ నటిస్తోంది. బి.ఎం.స్టూడియో పతాకంపై బత్తుల రతన్‌పాండే, మహంకాళి దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

తొలి సన్ని వేశానికి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి క్లాప్ ఇవ్వగా, మంచు లక్ష్మి, మనోజ్, తాప్సీ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించే ఈ చిత్రంలో శ్రీహరి ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారని, నవదీప్ తొలిసారిగా మాస్ హీరోగా కనిపిస్తారని, ఈరోజునుండి పది రోజులు రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని తెలిపారు.

శ్రీహరి మాట్లాడుతూ..దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ పాత్ర చేస్తున్నాను. మంచి సినిమా తీయాలనే ప్రొడ్యూసర్ తపన నాకు నచ్చింది. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. నవదీప్ మాట్లాడుతూ నాకెరీర్లో చేస్తున్న తొలి మాస్ క్యారెక్టర్, నాలోని హై ఎనర్జీ లెవల్స్ ఈ చిత్రంలో కనిపిస్తాయి. శ్రీహరి చేసే పాత్రకు ఈ సినిమాకు చాలా యాప్ట్ అవుతుందని వ్యాఖ్యానించారు.

మంచి కథ, నటీనటుల కాంబినేషన్లు కుదరడంతో ఈ చిత్రాన్ని ప్రారంభించామని, అందరికీ నచ్చే విధంగా ఉంటుందని నిర్మాత దివాకర్ అన్నారు. కార్యక్రమంలో క్రిష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మానందం, సత్యం రాజేష్, గీత భరత్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు, సంగీతం: చిన్నిచరణ్, మాటలు: రామస్వామి, కెమెరా: జి.కృష్ణప్రసాద్, నిర్మాతలు: బత్తుల రతన్‌పాండే, మహంకాళి దివాకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.

English summary
Actor Navdeep's new movie Vasool Raja was launched at Annapurna studios, Hyderabad. Ritu Barmecha, who shared screen space alongside Allari Naresh, in the film Aha Naa Pellanta, will be playing the female lead in this movie. Srihari is also playing a powerful cameo in this mass entertainer.
Please Wait while comments are loading...