పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో వేద
టాలీవుడ్ స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చిరకాల విరామం తర్వాత మరో చిత్రం డైరక్ట్ చేయటానికి సిద్దపడుతున్నట్లు సమాచారం.దాదాపు ఫేడవుట్ అయిపోయిన వేదని ప్రధాన పాత్రలో పెట్టి రూపొందించే ఆ చిత్రానికి సతీ సావిత్రి అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.పౌరాణికం బేస్ చేసుకుని నేటి సమకాలీన సమస్యలపై సెటైర్స్ వేస్తూ ఆధునికకాలంలో జరిగే కథగా ఈ స్క్రిప్టుని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రం పరుచూరి బ్రదర్స్ ఇధ్దరూ డైరక్ట్ చేయరని పరుచూరి గోపాల కృష్ణ ఒక్కరే డైరక్ట్ చేస్తారని మరో టాక్ వినపడుతోంది.స్క్రిప్టు వర్క్ పూర్తవగానే షూటింగ్ మొదలు కానుంది.ఇక పరుచూరి బ్రదర్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పడిపోయింది.వాళ్ళు రీసెంట్ గా రాసిన చిత్రాలు ఏమీ భాక్సాఫీస్ వద్ద ఆడలేదు.అలాగే ఈ మధ్య వారు చేసిన మెరుపు చిత్రం స్క్ర్రిప్టు దశలోనే ఆగిపోయింది.ఈ మధ్యన వారు స్కిప్టు వర్క్ చేసిన వీర చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











