»   » సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ కిడ్నాప్‌కు కుట్ర,వెలుగులోకి వచ్చింది

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ కిడ్నాప్‌కు కుట్ర,వెలుగులోకి వచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సూపర్ స్టార్ రజనీకాంత్ ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ జరిగిందా, అవుననే అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇదేమి సినిమాలో సీన్ కాదు. నిజ జీవితంలో జరిగిన దానిని తన సినిమాలో వాడుతున్నా అంటున్నారు ఆయన.

రజనీకాంత్ ని కిడ్నాప్ చేసేందుకు వీరప్పన్ భారీ ఎత్తున ప్రణాళికను కూడా రూపొందించుకున్నాడని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపాడు. వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ నిర్మించిన చిత్రం హిందీలో విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశాడు. ముంబై టైమ్స్ తో మాట్లాడిన వర్మ ఈ విషయాలు తెలియచేసారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...ఈ సినిమాను రూపొందించే పనిలో బాగంగా తాను సేకరించిన సమాచారం ప్రకారం, వీరప్పన్... రజనీకాంత్ కిడ్నాప్ కు ప్లాన్ వేసినట్టు తెలిసిందని పేర్కొన్నాడు. అది అంత సులభం కాదని తెలుసుకున్న తరువాతనే, ఆయన అదే ప్లాన్ కన్నడ స్టార్ రాజ్ కుమార్ పై అమలు చేశాడని తెలిపాడు.

ఇక వీరప్పన్ కోరుకుంటున్నట్లుగా...ఆయన మీద తీసిన సినిమా శేఖర్ కపూర్ ..బాండిట్ క్వీన్ కన్నా గొప్పది. ఎందుకంటే ఫూలన్ దేవి కన్నా వీరప్పన్ చాలా పెద్దవాడు అన్నారు.

"నేను సేకరించిన నిజాల ప్రకారం, వీరప్పన్ కథ నమ్మదగినది కాదు. ఆయన్ను చంపడానికి ప్రభుత్వాలు వేసిన ప్రణాళికలు అంతకన్నా నమ్మశక్యం కాదు. కానీ ఇవి నిజాలు" అని ఆయన తెలిపాడు. కాగా, ఈ చిత్రం హిందీలో 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ఇక తన సినిమా రిలీజ్ కు వచ్చినప్పుడల్లా ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచి, తన వైపుకు అందరినీ తిప్పుకునే వర్మ.. తన బాలీవుడ్‌ వీరప్పన్‌ సినిమాను ప్రమోషన్‌ను సంచలనంగానే చేస్తున్నాడు.

వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం కిల్లింగ్‌ వీరప్పన్‌ తెలుగులో విడుదల చేసిన వర్మ.. ఇపుడు హిందీలో కూడా వీరప్పన్‌ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ నిర్మించిన చిత్రం హిందీలో విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయటంతో ఇందులో ఎంతవరకూ నిజముంది అనేది మాత్రం తెలియరావటం లేదు.

English summary
A report published in Bombay Times stated that a sequence in the upcoming film will be about a plot sketched by Veerappan to kidnap superstar Rajinikanth. The director has said he has learnt about this plan through close alias of the bandit. It is notable that Veerappan has kidnapped Kannada superstar Rajkumar. RGV says, "From all the truth I gathered, Veerappan's story was unbelievable. But what is even more unbelievable is the drama which went behind the plan to kill him."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu