»   » 'బ్రహ్మోత్సవం' చూసి,రివ్యూ ఇచ్చిన వెంకయ్యనాయుడు

'బ్రహ్మోత్సవం' చూసి,రివ్యూ ఇచ్చిన వెంకయ్యనాయుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్‌ హీరోగా, కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్స్‌గా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్స్‌పై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించిన లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం మే 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఆదివారం రోజున సినీమ్యాక్స్ లో ఈ చిత్రాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా చూసారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ''సినిమాలో కలిసి ఉండాలి. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. మంచి సందేశాన్నిచ్చారు. ఇప్పుడు అందరూ చాలా బిజీగా, వేగవంతమైన జీవితాలను గడుపుతున్నారు. కానీ అందరూ కలిసి ఉండాలనే ఉత్తమమైన, ఉదాత్తమైన ఆలోచనను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చక్కగా తెరకెక్కించారు.వీడియో కర్టసీ: ఐడియల్ బ్రెయిన్


మహేష్ సినిమాలో ఏదో నటిస్తున్నట్లు కాకుండా మనం సాధారణంగా ఎలా ఉంటామో అలా కనిపిస్తూనే మంచి నటనను ప్రదర్శించారు. . పివిపిగారు సినిమాను చాలా రిచ్ గా, ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉండేలా నిర్మించారు. అందరూ కలిసి చూసే మంచి కుటుంబ కథా చిత్రం'' అన్నారు.


ఇక 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మహేష్‌కి దక్కిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ విజయం అందించిన ఉత్సాహంతో మరోసారి కుటుంబ కథని నమ్మి 'బ్రహ్మోత్సవం' చేశాడు మహేష్‌. 'సీతమ్మ...'ని తెరకెక్కించిన శ్రీకాంత్‌ అడ్డాలనే ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి రెండోసారి కూడా 'సీతమ్మ...' తరహా మేజిక్‌ వర్కవుట్ కాలేదనే చెప్పాలి.


మహేష్‌బాబు, కాజల్‌, సమంత, ప్రణీత, సత్యరాజ్‌, రావు రమేష్‌, జయసుధ,రేవతి,శరణ్య,ఈశ్వరి,తనికెళ్ల భరణి,సాయాజీషిండే, నాజర్‌, తులసి,కృష్ణభగవాన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: రత్నవేలు, కళ: తోట తరణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: పెరల్‌.వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, మహేష్‌బాబు, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల . సమర్పణ: జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌.

English summary
Union Urban Affairs Minister Venkaiah Naidu has watched the Brahmotsavam movie.Addressing the media, after watching the movie, the union minister said that it is a movie that highlights the family sentiments and the importance of togetherness in the family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu