For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమాలంటే ఇంట్రస్ట్ లేని నన్నే ఆకట్టుకుంది,‘గౌతమిపుత్ర’ చూసి ఆశ్చర్యపోయా

  By Srikanya
  |

  హైదరాబాద్‌: బాలకృష్ణ, శ్రియ జంటగా క్రిష్‌ దర్శకత్వం వహించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సంక్రాంతి సందర్భంగా గురువారం విడుదలై భాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కలెక్షన్స్ తో ప్రశంసలూ సైతం అందుతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ చిత్రం చూసి ప్రశంశల్లో ముంచెత్తారు. తాజాగా ఈ చిత్రాన్ని యూనియన్ మినిస్టర్ వెంకయ్య నాయుడు చూడటం జరిగింది.

  నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచేలా శాలివాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను అందించిన క్రిష్‌కు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వెంకయ్య గౌతమిపుత్ర సినిమాను చూసారు. అనంతరం నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌, మాటల రచయిత సాయిమాధవ్‌తో పాటు సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు.

  అతి తక్కువ కాలంలోనే ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపని తనకు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఆకట్టుకుందని, తప్పకుండా మరింతగా ప్రేక్షకాదరణ పొందుతుందన్నారు. ఆయనతో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు శాతకర్ణి చిత్రాన్ని చూసి చిత్ర యూనిట్ అభినందించారు.

  చిత్రానికి లభిస్తున్న స్పందనపై చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తూ....''మనదైన చరిత్రని ప్రేక్షకులకి చేరువ చేయాలనే సంకల్పంతోనే క్రిష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాని ప్రత్యేకంగా చూస్తున్నారు. పండగ తర్వాత థియేటర్లను పెంచుతున్నాం. కేవలం 79 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశారు క్రిష్‌. అందుకు బాలకృష్ణ, ఇతర చిత్రబృందం అందించిన తోడ్పాటే కారణం.

  బాలకృష్ణగారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన గుర్రంపై 12 గంటల పాటు కూర్చున్న సందర్భాలున్నాయి. బాలకృష్ణ పలికిన సంభాషణలు, యుద్ధ సన్నివేశాల గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలు వినోదపు పన్నులో మినహాయింపు ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేయగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇవాళొ, రేపో ఉత్తర్వును విడుదల చేసే సన్నాహాల్లో ఉంది. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు చూసి అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు త్వరలోనే చూడనున్నార''ని తెలిపారు నిర్మాతలు.

  Venkaiah Naidu watched Gautami Putra Satakarni

  ''క్రిష్‌ నుంచి ఒకదాన్ని మించిన మరో చిత్రం వస్తోంది. తను కొత్తగా తీయబోయే సినిమా మరో స్థాయిలో ఉంటుంది. అలా నిర్మించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే క్రిష్‌ చేయబోయే చిత్రమేది? అదెలా ఉంటుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని మించిపోయేలా చేస్తాం. ఆ చిత్రానికి ఈ ఏడాదిలోనే శ్రీకారం చుడతామ''అన్నారు నిర్మాతలు.

  ఇక చిత్రం టాక్ ఎలా ఉందంటే..శాతకర్ణిగా బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది...బాలయ్య ఎంట్రీ తో థియేటర్స్ దద్దరిల్లింది ..అలాగే యుద్ధసన్నివేశం లో మొదలైన ఫస్ ఫైట్ లో విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. యుద్ధ ఫైట్ తర్వాత శాతకర్ణి భార్య వశిష్టి దేవిగా శ్రియ చాల అందంగా కనిపించింది..శ్రీయ - బాలకృష్ణ ల మధ్య వచ్చే ఏకిమీడా రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది.

  ఇక ఈ చిత్రం కథా, కథనం ఆకట్టుకునేలా డిజైన్ చేసారు క్రిష్. ముఖ్యంగా బుర్రా సాయిమాధవ్‌ రాసిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా చెప్తున్నారు. శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడని.. యుద్ధ సన్నివేశాలు చాలా రిచ్‌గా తెరకెక్కించారని అంటున్నారు. చిత్రంలోని ఎమోషన్స్ ఆయా సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చాయి. ఇక విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. డైరక్టర్ గా క్రిష్‌ మరో మెట్టు ఎక్కారని, టేకింగ్‌, కథనం నడిపిన తీరు చాలా బాగుందంటున్నారు.

  Venkaiah Naidu watched Gautami Putra Satakarni

  శాతకర్ణి జీవితం బుర్ర కథ చెప్పే పాత్రలో కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్ కనిపించి అలరించారు. గ్రీకు రాజు నహాపనతో శాతకర్ణి చేసే యుద్ధం సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ అంత యుద్దాలు , గ్రాఫిక్స్ తో ఆకట్టుకుంది...బాలయ్య పోరాట సన్నివేశాలను అభిమానులు ఎంజాయ్ చేసారు..ఇక సెకండ్ హాఫ్ కూడా ఆకట్టుకునే రీతిలో ఉంది. శ్రియ, హేమ మాలిని పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉండి కథకు కలిసివచ్చేలా సాగాయి. సాహో శాతకర్ణి అంటున్నారు.

  English summary
  Union Minister Venkaiah Naidu watched Gautami Putra Satakarni at Prasad Preview Labs in Hyderabad on Saturday. Venkaiah Naidu thoroughly enjoyed the film and lavished praises on the filmmakers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X