»   » పెద్దోడ్ని చెబుతున్నా...మీ అందరికీ దిమ్మ తిరుగుద్ది : వెంకటేశ్ (వీడియో)

పెద్దోడ్ని చెబుతున్నా...మీ అందరికీ దిమ్మ తిరుగుద్ది : వెంకటేశ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :''ఈ పెద్దోడు చెబుతున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక మీ అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. బాక్సాఫీస్ బద్దలైపోతుంది'' అన్నారు వెంకటేష్. ఇంతకీ వెంకటేష్ చెప్పేది ఏ చిత్రం గురించీ అంటారా..ఇంకే చిత్రం శ్రీమంతుడు గురించి. మహేష్ హీరోగా రూపొందిన శ్రీమంతుడు చిత్రం ఆడియో నిన్న రాత్రి జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


వెంకటేష్‌ మాట్లాడుతూ ''ట్రైలర్‌ చూశాక నేను రెండు సైకిళ్లు కొని ప్రాక్టీస్‌ చేసి తొక్కాను. ఆ సైకిల్‌పై నేను రఫ్‌గా కనిపిస్తా. మా చిన్నోడు చాలా స్మూత్‌గా, అందంగా ఉన్నాడు. అదేం టెక్నికో మనందరికీ తెలుసు. 'శ్రీమంతుడు' చూశాక మనందరికీ దిమ్మతిరిగిపోద్ది. రికార్డులు బద్దలవుతాయి''అన్నారు. ఆ వీడియో ఇప్పుడు చూడండి.''శ్రీమంతుడు టైటిల్ చాలా బాగుంది. మహేశ్ గ్లామరస్‌గా ఉన్నాడు. ఇండస్ట్రీలో 'శ్రీమంతుడు' గురించి టాక్ బాగుంది'' అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ సమష్టిగా నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది.


Venkatesh About Srimanthudu Movie Success

ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ గల్లా జయదేవ్, నిర్మాత ఆదిశేషగిరి రావు, దర్శకులు శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, నటుడు సుధీర్‌బాబు తదితరులు పాల్గొని, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, శ్రుతీహాసన్, నటుడు రాహుల్ రవీంద్రన్, కెమేరామన్ మది, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

English summary
Venkatesh Speech at Srimanthudu Audio Launch featuring Mahesh Babu, Shruti Haasan in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu