»   » బొబ్బిలిరాజా ఈజ్ బ్యాక్...( 'బాబు బంగారం' ట్రైలర్)

బొబ్బిలిరాజా ఈజ్ బ్యాక్...( 'బాబు బంగారం' ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా నటించిన చిత్రం 'బాబు బంగారం'. ఈ చిత్రం ఆడియో సినీ ప్రముఖుల సమక్షంలో నిన్న ఆదివారం రాత్రి విడుదలైంది. ఈ సందర్బంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ వెంకటేష్ పాతికేళ్లు వెనక్కి వెళ్లాడంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

వెంకటేష్‌ మాట్లాడుతూ... ''ముఫ్పై ఏళ్లు ఎలా గడిచిపోయాయో నాకే అర్థం కావడం లేదు. వేదికలపై పెద్దగా మాట్లాడడం రాదు. ఏం చేసినా తెరపైనే. కేవలం అభిమానుల ప్రేమ కోసం, వాళ్ల కళ్లలో ఆనందం కోసం ఇలాంటి వేడుకలకు వస్తుంటా. తొలి సినిమా నుంచీ నన్ను ప్రోత్సహిస్తున్నవాళ్లందరికీ నా కృతజ్ఞతలు. సినిమాలు తగ్గించేద్దాం అనుకొంటున్న సమయంలో మారుతి నాతో ఈ సినిమా తీశాడు.


Venkatesh, Nayanthara's Babu Bangaram Theatrical Trailer

తెరపై నన్ను నేను చూసుకొంటుంటే పదిహేనేళ్లు వెనక్కి వెళ్లిపోయాననిపించింది. ఈ సినిమా తరవాత నన్ను పెళ్లికాని ప్రసాద్‌ అని పిలుస్తారో.. 'బాబు బంగారం' అని పిలుస్తారో చూడాలి. ఈ సినిమాని 'బొబ్బిలి రాజా'ని చేస్తారో.. 'చంటి'ని చేస్తారో, 'సీతమ్మ వాకిట్లో..' చేస్తారో.. ప్రేక్షకుల చేతుల్లో ఉంది. మా అబ్బాయి అర్జున్‌ వచ్చే వరకూ నటిస్తూనే ఉంటా'' అన్నారు.


ఈ సినిమాలో వెంకటేష్ ఓ కామిక్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

English summary
Babu Bangaram Baabu Bangaaram trailer starring Venkatesh, Nayanthara in the lead roles released. Directed by Maruthi. Produced by Naga Vamsi Suryadevara & PDV Prasad on Sithara Entertainments banner. Music composed by Ghibran.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu