హీరోగా వెంకటేష్ కొడుకు ఎంట్రీ.. మేటర్ లీక్ చేసిన పర్సనల్ మేకప్ మ్యాన్!

మన సినిమారంగంలో వారసుల ఎంట్రీ అనేది చాలా సాధారణమైన విషయం. హీరోల వారసుల మొదలు దర్శక నిర్మాతలు అలాగే ఇతర నటీనటుల వారసులు కూడా సినీ రంగంలో ప్రవేశించి తమ లక్ పరీక్షించుకుంటూ ఉంటారు. ఇప్పటికే అలా చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చి చాలామంది క్లిక్ అయ్యారు కూడా. ఇప్పుడు వెంకటేష్ వారసుడిగా ఆయన కుమారుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ అడపాదడపా వస్తున్న వార్తల మీద క్లారిటీ ఇచ్చారు వెంకటేష్ పర్సనల్ మేకప్ మాన్. ఆ వివరాల్లోకి వెళితే

చాలా రోజుల తరువాత హిట్

చాలా రోజుల తరువాత హిట్

చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ నారప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిజానికి ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమా రీమేక్ అయినా సరే వెంకటేష్ తనదైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఎక్కడా తగ్గకుండా వెంకటేష్ నట విశ్వరూపం చూపించడంతో ఈ సినిమా అటు దగ్గుబాటి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేసింది. సినిమాలో వెంకటేష్ నటన అలాగే ఇతర అన్ని ఎలిమెంట్స్ కలుపుకుని సినిమా బాగా కుదిరింది.

వెంకటేష్ కుమారుడి సినిమా ఎంట్రీ

వెంకటేష్ కుమారుడి సినిమా ఎంట్రీ

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు ఇతర టెక్నీషియన్స్ ని పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ పర్సనల్ మేకప్ మాన్ గా ఉన్న రాఘవ అనే ఆయనతో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ నిర్వహించగా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. అలాగే వెంకటేష్ కుమారుడి సినిమా ఎంట్రీ గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎక్స్ట్రార్డినరీ వ్యక్తి

ఎక్స్ట్రార్డినరీ వ్యక్తి

వెంకటేష్ కుమారుడు అర్జున్ ఒక ఎక్స్ట్రార్డినరీ వ్యక్తి అని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడు చూసినా అర్జున్ పుస్తకాలతోనే కనిపించేవాడు అని చెప్పుకొచ్చారు. సాధారణంగా స్టార్లకి తమ పిల్లలని సినిమారంగంలోకి తీసుకురావాలని ఉంటుందని వారి కోసం స్పెషల్ గా ఒక మంచి డెబ్యూ సినిమా కూడా ప్లాన్ చేయాలని ఉంటుందని కానీ వెంకటేష్ కుమారుడు విషయానికి వస్తే అలాంటిది ఏదీ లేదని చెప్పుకొచ్చారు.

ఆ ఆలోచన లేదేమో

ఆ ఆలోచన లేదేమో

ఆయనకు సినిమా రంగం మీద ఆసక్తి ఉండి ఉంటే ఇప్పటికే డెబ్యూ సినిమా చేసి ఉండాలని, కానీ ఆయన ఆసక్తి చూపిస్తున్నాడని తనకు అనిపించ లేదు అని చెప్పుకొచ్చారు. ఈ విషయం మీద తనకి డైలమాగా ఉందని అన్నారు. బహుశా ఆయనకు ఆసక్తి ఉంటే ఆయన చదువు అంతా పూర్తయ్యాక అప్పుడు సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

Recommended Video

Rumours On Narappa Movie Release | Acharya వల్లే..!!
మంచి హైటే

మంచి హైటే

అలాగే వెంకటేష్ కుమారుడు అర్జున్ చాలా తెలివైన వాడు అని చెబుతూ ఆయన ఆలోచనా విధానం కూడా చాలా గొప్పగా ఉంటుందని మేకప్ మెన్ వెల్లడించారు. అయితే రానా వివాహం సమయంలో వెంకటేష్ కుటుంబం అంతా ఉన్న ఫొటోలు వైరల్ కాగా అందులో అర్జున్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. తన తండ్రి, అన్న రానాలాగా ఆయన కూడా హైట్ గా కనిపిస్తూ ఫోటోలలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X