»   » హోం మినిస్టర్ పదవికి హీరో వెంకటేష్?

హోం మినిస్టర్ పదవికి హీరో వెంకటేష్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Venkatesh
హైదరాబాద్: తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, అదో మురికి కూపం, అందులోకి వెళితే నిజాయితీగా ఉండటం కష్టం అని ఇటీవల వెంకటేష్ పాలిటిక్స్‌పై తన అయిష్టాన్ని వెల్లగక్కిన సంగతి తెలిసిందే. మరి అలాంటి ఆయన హోం మినిస్టర్ పదవి చేపట్టడానికి ఎలా ఒప్పుకున్నాడనేగా? మీ డౌట్. ఆయన ఈ పదవి అదిష్టించడానికి ఒప్పుకుంది రియల్ లైఫ్ లో కాదు...రీల్‌ లైఫ్‌లో!

తన రాబోయే సినిమా 'రాధ'లో వెంకటేష్ హోం మినిస్టర్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈచిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఉంటుందని తెలుస్తోంది. అవినీతి, కుళ్లు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే కాన్సెప్టుతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట.

లేడీ టైటిల్స్‌తో గతంలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'లక్ష్మి'గా...ఆ తరువాత బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రంలో 'తులసి'గా వచ్చిన వెంకీ మారుతి దర్శకత్వంలో 'రాధ' సినిమాతో కూడా ప్రేక్షకులను అలరిస్తాడని అంటున్నారు. సినిమా మొత్తం పూర్తిగా రాజకీయాలే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా కూడా ఉండనుందని తెలుస్తోంది.

ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలో పూర్తి వివరాలు దర్శకుడు వెల్లడించనున్నాడు. ప్రస్తుతం మారుతి అల్లు శిరీష్ హీరోగా 'కొత్త జంట' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ కాపీ వచ్చాక ఈయనతో విక్టరీ వెంకటేష్‌ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. సంక్రాంతికి 'రాధ' సినిమా షూటింగ్ లాంచనంగా ప్రారంభించి మార్చి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపాలనే ప్లాన్లో ఉన్నాడట మారుతి. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారు.

English summary
After walking out of the multistarrer film with Ram Charan, Venkatesh has signed a new project with director Maruthi. Produced by D.V.V. Dhanayya, the film will feature the actor in the role of a Home Minister for the first time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu